తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (S. S. Rajamouli) అయితే.. ఆ సినిమాను భుజాన మోసింది ప్రభాస్ (Prabhas) . ‘బాహుబలి’ (Baahubali) అంటే ప్రభాస్ అంటే ‘బాహుబలి’ అనేలా ఆ రోజుల్లో పేరు మారుమోగింది. ఆ తర్వాత సరైన విజయం పడక ఇబ్బంది పడినా.. రీసెంట్‌గా ‘సలార్’ (Salaar) సినిమాతో తానేంటో మరోసారి నిరూపించాడు. వందల కోట్ల వసూళ్లు తన పెద్ద విషయం కాదని చెప్పకనే చెప్పాడు. ఈ రోజు ఈ టాలీవుడ్ డార్లింగ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం!
Prabhas
* ప్రభాస్ అంటే.. ప్రభాస్ రాజు, డార్లింగ్ అని మాత్రమే ఎక్కువ మందికి తెలుసు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు.