నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘అఖండ’. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్ మరియు టైటిల్ రోర్ లకి ప్రేక్షకుల నుండీ మంచి ఆదరణ లభించింది. ఇటీవల విడుదల చేసిన ‘భమ్ అఖండ’ టైటిల్ సాంగ్ ప్రోమోకి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.
తాజాగా ఫుల్ లెన్త్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. తమన్ సంగీతంలో రూపొందిన ఈ పాట మాస్ ప్రేక్షకులకి బాలయ్య అభిమానులకి గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉందని చెప్పొచ్చు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటని శంకర్ మహదేవన్, శివమ్ మహదేవన్, సిద్దార్థ్ మహదేవన్ లు ఆలపించిన తీరు అందరినీ మెప్పిస్తుంది.బాలయ్య అఘోర గెటప్ లో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. లిరికల్ సాంగ్ మధ్యలో మేకింగ్ కు సంబంధించిన క్లిపింగ్స్ కూడా చూపించారు.
బాలయ్యకి బోయపాటి సన్నివేశాల గురించి వివరిస్తున్న దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయనే సంకేతాలు కూడా ఇస్తుంది ఈ లిరికల్ సాంగ్. మీరు కూడా ఓ లుక్కేయండి :