యావత్ తెలుగు చిత్రసీమలో మన ప్రియతమ కథానాయకుడు మరియు రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణకు తెలుగు మరియు సంస్కృతి భాషలపై ఉన్నంత పట్టు కానీ.. భాషా ప్రావీణ్యం కానీ మరెవరికీ లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అటువంటి బాలకృష్ణ స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్ లను జనాలు ఎంతగా ఎంతగా ఎంజాయ్ చేస్తారో.. ఆయన స్పీచ్ ల నుంచి కొత్త తెలుగు పదాలు కూడా అదే విధంగా తెలుసుకొంటారు. అటువంటి బాలయ్య పొరపాటున అన్నాడో లేక పదప్రయోగం బెడిసికొట్టిందో తెలియదు కానీ.. శనివారం తమ కుటుంబం నుంచి మరో రాజకీయ వారసురాలైన నందమూరి సుహాసిని మీడియాకి పరిచయం చేస్తూ ఆ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ “హరికృష్ణ మరణం నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది” అని వ్యాఖ్యానించడం కొత్త చర్చలకు దారి తీసింది.
దివంగత హరికృష్ణ మరణం అనంతరం ఆయన మరణంపై బాలయ్య స్పందించిన తొలి సందర్భం కూడా అదే. అలాంటి సమయంలో బాలయ్య ఆయన మారణం “సంభ్రమాశ్చర్యానికి” గురి చేసింది అనడం ఎంతవరకు సబబు అని తెలుగుదేశం పార్టీ వర్గాలతోపాటు నందమూరి అభిమానులు కూడా బాధపడుతున్నారు. కేవలం కొందరు హార్డ్ కోర్ బాలయ్య ఫ్యాన్స్ తప్ప ఎవరూ ఈ విషయంలో బాలయ్యను సపోర్ట్ చేయలేదు. మరి ఈ విషయమై బాలయ్య ఏమైనా రెస్పాండ్ అవుతారా లేక ఎప్పట్లానే ఇగ్నోర్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.