NBK109: ఈసారి బాక్సాఫీస్ టార్గెట్ పెద్దదే!
- October 22, 2024 / 08:09 PM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) , బాబీ (Bobby) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘NBK109’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా చివరి దశలో ఉన్నట్లు సమాచారం. సంక్రాంతి 2025 సందర్భంగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక తేదీ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ఈ సినిమాపై పక్కా ఆ టైమ్ లోనే వస్తుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ‘NBK109’ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
NBK109

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరగడం విశేషం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 35-40 రేషియోతో ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం. ఓవరాల్ గా 75 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల బిజినెస్ పూర్తయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇదే రీతిలో వరల్డ్ వైడ్ గా ‘NBK109’ సినిమా 90 కోట్ల వరకు బిజినెస్ సాధించింది.

అంటే ఈ సినిమా 95 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సూపర్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంతో బాలయ్య 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరతారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ సాధించిన చిత్రంగా ఇది నిలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణకు ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) కనిపించబోతున్నారు. ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) , ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పవర్ ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో కూడిన కథతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకుడు బాబీ వెల్లడించారు. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి భారీ విజయానంతరం బాబీ నుండి వస్తున్న సినిమా కావడం కూడా దీనిపై భారీ అంచనాలు నెలకొల్పుతోంది. ఇక బాలయ్య ఇటీవలే ‘అఖండ 2’ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమా నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

















