Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

‘అఖండ 2’ (Akhanda 2)  సినిమా కోసం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) మరోసారి చేతులు కలిపిన విషయం తెలిసిందే. మొదటి భాగం ఇచ్చిన మాస్ హైపే కాదు, అఘోర పాత్ర బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు మరింత భారీ స్థాయిలో ‘అఖండ 2’ను రూపొందిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం, జార్జియాలో కీలక షెడ్యూల్ మొదలైపోయింది. ఇందులో ఓ హై ఎనర్జీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించబోతున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌కు ప్రత్యేకత ఏమిటంటే, ఇదే సీన్‌లో బాలకృష్ణ సెకండ్ రోల్‌పై క్లారిటీ వస్తుందట.

Akhanda 2

ఇప్పటివరకు అఘోర పాత్రను మాత్రమే ప్రమోషన్లలో చూపించారు. కానీ సినిమా మరో ట్విస్టుగా సెకండ్ పాత్ర కూడా కీలకమవుతుందని బోయపాటి స్క్రిప్ట్‌లో ప్లాన్ చేశారని సమాచారం. ఇప్పుడు జార్జియాలో బాలయ్య ఈ రెండో పాత్రతో ఫుల్ యాక్షన్ మూడ్‌లో కనిపించబోతున్నారని తెలిసింది. సినిమాలో ఈ ట్విస్టును రివీల్ చేసే విధంగా రూపొందించిన ఈ యాక్షన్ సీన్, భారీ బడ్జెట్‌తో ప్లాన్ అయ్యింది. విదేశీ స్టంట్ మాస్టర్ల సహకారంతో చిత్రీకరించబోతున్న ఈ ఫైట్..

క్లైమాక్స్‌కు సమానంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. అంతే కాదు, ఈ సీన్‌లో బాలయ్య గెటప్ కూడా పూర్తిగా వేరేలా ఉంటుందని అంటున్నారు. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో “ఇంకొక లుక్.. ఇంకొక పవర్” అంటూ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే ‘అఖండ 2’ సెట్స్‌పై వచ్చిన ప్రతి అప్డేట్‌కు ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఈ కొత్త పాత్ర ఎలాగ ఉంటుందోనన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

ఈ షెడ్యూల్ ముగిశాక ఫస్ట్ గ్లింప్స్ ద్వారా బాలయ్య కొత్త రోల్‌ను అధికారికంగా రివీల్ చేసే అవకాశం ఉందని బజ్. ప్రస్తుతం సెప్టెంబర్ రిలీజ్ కోసం టీమ్ అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తోంది. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడితే, అక్టోబర్ దసరా రిలీజ్‌ను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. కానీ బాలయ్య కొత్త పాత్రకు సంబంధించిన మిస్టరీ మరోసారి సినిమా మీద బజ్ పెంచేలా చేస్తోంది. ‘అఖండ 2’ ఫాన్స్‌కు ఇది మరింత ఆసక్తికరమైన కంటెంట్‌గా మారింది.

కోట్ల గేమ్ పై చేతులెత్తేశారు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus