Balakrishna: బాలయ్య గోపీచంద్ మూవీలో ఆ పాత్ర చనిపోతుందా?

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ కన్నడలో హిట్ గా నిలిచిన మఫ్టీ సినిమాకు రీమేక్ అని ప్రచారం జరగగా మేకర్స్ ఇప్పటికే ఆ ప్రచారాన్ని ఖండించిన సంగతి తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని సొంత కథతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య హీరోగా క్రాక్ సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అన్నాచెల్లెళ్ల మధ్య ఇగోకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. అన్నగా, మేనల్లుడిగా రెండు పాత్రల్లో బాలయ్య ఈ సినిమాలో కనిపిస్తారని సినిమాలో అన్న పాత్ర చనిపోతుందని తెలుస్తోంది. అమెరికాలో ఈ సినిమాకు సంబంధించి కొంతభాగం షూటింగ్ జరగనుంది. మరోవైపు కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు వీర సింహా రెడ్డి అనే టైటిల్ ప్రచారంలోకి రాగా ఈ టైటిల్ పై బాలయ్య పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాకు సరైన టైటిల్ ను ఫిక్స్ చేసే పనిలో పడ్డారు. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తుండగా ఆమె పాత్ర వెరైటీగా ఉండనుందని తెలుస్తోంది. బాలయ్య తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లు నటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శృతిహాసన్ సైతం ఒకవైపు స్టార్ హీరోలతో మరోవైపు సీనియర్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఈ నెల 3, 4 తేదీలలో కర్నూలు జిల్లాలోని అహోబిలంలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. యాక్షన్ కు ఈ సినిమాలో భారీస్థాయిలో ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. అఖండ సినిమాకు యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలవగా ఆ సినిమాను మించి ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని బోగట్టా.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus