Balakrishna: ‘ఆదిత్య 369’ సీక్వెల్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బాలయ్య కొడుకు.. ?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ చిరంజీవి, నాగార్జున కొడుకులు హీరోలుగా ఎంట్రీలు ఇచ్చేసి రాణిస్తున్నారు.వెంకటేష్ కొడుకు ఎలాగూ వయసులో చిన్నోడు. కాబట్టి నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల చూపంతా మోక్షజ్ఞ డెబ్యూ పైనే ఉంది. గత 3 ఏళ్లుగా అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అవి గాలి వార్తలుగా మిగిలిపోయాయి.

మరోపక్క మోక్షజ్ఞ కూడా ఫిజిక్ పై దృష్టి పెట్టడం లేదు.దీంతో అభిమానులకు మరింత కంగారు పట్టుకుంది. బాలయ్య కూడా మోక్షజ్ఞ డెబ్యూ గురించి ఏ ఇంటర్వ్యూల్లోనూ, సినిమా వేడుకల్లోనూ మొన్నటివరకు ప్రస్తావించింది లేదు. అయితే ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య పరోక్షంగా స్పందించాడు. ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2.. ఎపిసోడ్ 3 లో భాగంగా బాలయ్య ఈ విషయం పై స్పందించాడు. ‘ఆదిత్య 369’ సినిమాకి చాలా మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.

టెక్నాలజీ అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే అలాంటి విజువల్ వండర్ ను ప్రేక్షకులకు అందించామని.. దానికి సీక్వెల్ కు తగ్గ కథని కూడా రెడీ చేసుకున్నానని వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నట్టు వెల్లడించాడు. ‘ఆదిత్య 999 మాక్స్’ పేరుతో ఈ చిత్రాన్ని తన దర్శకత్వంలో రూపొందించబోతున్నట్టు కూడా బాలయ్య ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పటి రోజుల్లో అలాంటి పెద్ద ప్రాజెక్టుని రూపొందించాలి అంటే వందల కోట్ల బడ్జెట్ అవుతుంది. ఈ మూవీతో మోక్షజ్ఞ లాంచింగ్ ఫిక్స్ అంటున్నారు. మరి దర్శకత్వం విషయంలో ఎటువంటి అనుభవం లేని బాలయ్య.. తన కొడుక్కి సరైన లాంచింగ్ ఇవ్వగలడా? అనే భయాలు అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఎక్కువగానే ఉన్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus