నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ సోషల్ మీడియా పోస్ట్లు ఈ మధ్య టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంటున్నాయి. ఆయన పోస్టులు కానీ మాటలు కానీ ఎదో ఒక చర్చకు దారితీస్తున్నాయి. కాగా నేడు ఉదయమే ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అది ఆంధ్రప్రదేశ్ సి ఎమ్ జగన్ విజయానికి ఉద్దేశించినది. గత ఏడాది ఏప్రిల్ లో ఎలక్షన్స్ జరుగగా వాటి ఫలితాలు 2019 మే 23న వెలువడ్డాయి. ఆ ఎలక్షన్స్ లో వైస్సార్సీపీ పార్టీ తరపున జగన్ భారీ విజయాన్ని అందుకున్నారు.
ఆ ఎన్నికల ఫలితాలు వెలువడి సరిగ్గా ఏడాది అవుతున్న నేపథ్యంలో బండ్ల గణేష్ ‘చారిత్రక విజయానికి ఏడాది’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. నిజానికి ఓ సాధారణ వ్యక్తిగా ఆ పోస్ట్ కి అంత ప్రాధ్యాత లేదు. కానీ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ భక్తుడు కావడమే ఇక్కడ విషయం. ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీ వై ఎస్ జగన్ ని పూర్తిగా వ్యతిరేకించే పార్టీగా ఉంది. ఎన్నికలకు ముందు నుండి పవన్ కళ్యాణ్ జగన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పవన్ కానీ ఆయన పార్టీ కానీ అలాగే అభిమానులు కానీ జగన్ కి వ్యతిరేకులే. అలాంటిది పవన్ భక్తుడిని అని చెప్పుకొనే బండ్ల గణేష్ జగన్ విజయాన్ని స్మరించుకోవడం ఆశ్చర్యం వేస్తుంది. ఒక వేళ బండ్ల గణేష్ వై ఎస్ జగన్ పార్టీలో చేరాలి అనుకుంటున్నాడా అంటే, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైనా ఘోర పరాజయం తరువాత ఆయన రాజకీయాల వైపు వెళ్లను అని చెప్పారు. మరి బండ్ల గణేష్ ట్విట్టర్ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏమిటో.?