నిన్న సాయంత్రం నుంచి ఒకటే హడావుడి. పివిపికి డబ్బులు ఇవ్వని కేసులో బండ్ల గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారని కథనాలు వెలువడడంతో.. అందరూ నిజమే అనుకొన్నారు. కానీ.. నిన్న సాయంత్రం ఈ విషయంలో స్వయంగా బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చాడు. తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, కేవలం ప్రశ్నించడం కోసం స్టేషన్ కి తీసుకెళ్లారని, ఆ తర్వాత తాను ఇంటికి వచ్చేశానని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.
అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే గతంలో కడపకు చెందిన ఒక వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 13 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదనే కేస్ విషయంలో కడప జిల్లా కోర్ట్ బండ్లను కోర్టుకి హాజరవ్వమని చెప్పినా.. బండ్ల పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు కడప పోలీసులు.. హైద్రాబాద్ పోలీసుల సహాయంతో బండ్లను కడప కోర్టులో హాజరుపరిచే ప్రయత్నంలో ఉన్నారు. ఆ కేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సొ, బండ్ల ఇమ్మీడియట్ గా ఈ రెండు కేసుల నుంచి బయటపడాలంటే అర్జెంట్ గా 20 కోట్ల రూపాయలు కావాలి. అంత పెద్ద మొత్తాన్ని బండ్ల ఎప్పుడు సంపాదించాలి, ఎప్పటికీ క్లియర్ చేయాలి అని అందరూ అనుకొంటున్నారు.