Bandla Ganesh: నాన్న మాటను పాటిస్తున్నానన్న బండ్ల గణేష్!

నటుడిగా, నిర్మాతగా, పవన్ వీరాభిమానిగా బండ్ల గణేష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమనే సంగతి తెలిసిందే. పవన్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. బండ్ల గణేష్ ప్రస్తుతం డేగల బాబ్జీ అనే సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా త్వరలో రిలీజ్ కానుందని సమాచారం. ఇప్పటికే రిలీజైన డేగల బాబ్జీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. తాజాగా ఒక సందర్భంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పవన్ ను తాను సినిమా అడగలేదని పవన్ ను సీఎంగా చూడాలని ఉందని పార్టీ ఏదైనా తాను పవన్ కు భక్తుడినని బండ్ల గణేష్ తెలిపారు. పవనేశ్వర అని దానంతట అదే వచ్చేసిందని బండ్ల గణేష్ తెలిపారు. హీరోలు ఏమైనా దేవుళ్లా? అంటూ బండ్ల గణేష్ కామెంట్లు చేశారు. రవితేజతో కృష్ణవంశీతో వివాదాలేమిటనే ప్రశ్నకు స్పందిస్తూ తన దగ్గర వాళ్లు పొలాలు కొన్నారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. తన జీవితమే సినిమా కాదని సినిమా లైఫ్ లో పార్ట్ అని బండ్ల గణేష్ వెల్లడించారు.

చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్తానంటే నాన్న వద్దన్నాడని అమ్మ వెళ్లమందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఆ సమయంలో నాన్న హైదరాబాద్ కు వెళ్తే వెళ్లు కానీ మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు. కుళాయి నీళ్లు తాగు కానీ ఒకడి మోచేతి నీళ్లు తాగవద్దని నాన్న చెప్పాడని తాను ఆ మాటను పాటిస్తున్నానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus