బండ్ల బాబు డైరెక్టర్ హరీష్ భాయ్ భాయ్ అంటున్నారే

కొద్దిరోజుల క్రితం దర్శకుడు హరీష్ శంకర్ మరియు నిర్మాత బండ్ల గణేష్ మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. ఒకరిని ఉద్దేశిస్తూ మరొకరు ట్వీట్స్ తో కొట్టుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్, హరీష్ తో ఇక సినిమా తీయను అని ఓపెన్ గా చెప్పడం జరిగింది. కాగా తాజా ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ తన వర్షన్ మార్చారు. హరీష్ తో మూవీ చేస్తాను అన్నారు. అదేమిటీ…గతంలో ఆయనతో మూవీ చేయననని చెప్పారుగా అంటే…ఎదో కోపంలో అన్నాను.

భార్య భర్తల మధ్య, అమ్మ కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య మాటపట్టింపులు రావా…మా గొడవ కూడా అలాంటిదే అన్నారు. ఎదో చిన్న ఇగో వలన ఇద్దరం మాట మాట అనుకోవడం నిజమేనన్నారు. హరీష్ తన సోదర సమానుడన్న బండ్ల గణేష్, అంత పెద్ద డైరెక్టర్ డేట్స్ ఇస్తే మూవీ ఎందుకు చేయను అన్నారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తు డైరెక్టర్ హరీష్, బండ్ల గణేష్ అంటే నాకు చాలా ఇష్టం అని, మిరపకాయ మూవీ కంటే ముందే నాతో సినిమా చేయాలని అన్నారని, తనపై అభిప్రాయం మార్చుకున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు.

మొన్నటివరకు ట్వీట్స్ తో తిట్టుకున్న వీరిద్దరూ సడన్ గా భాయ్ భాయ్ అనుకోవడం అందరిని ఆశ్యర్యంలోకి నెట్టింది. ఇక వీరి మధ్య వివాదానికి కారణం…గబ్బర్ సింగ్ సినిమా విడుదలై 8ఏళ్ళు పూర్తయిన సంధర్భంగా ఆ మూవీ విజయంలో భాగమైన అందరికీ పేరుపేరున హరీష్ కృతఙ్ఞతలు తెలిపారు. ఐతే ఆయన మూవీ నిర్మాత బండ్ల గణేష్ పేరు వదిలేశారు. సినిమా ఫోర్ ఫిల్లర్స్ లో ఒకరైన నిర్మాతను ఆయన ఉద్దేశ పూర్వకంగానే వదిలేశాడని బండ్ల గణేష్ హర్ట్ అయ్యారు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus