తెలుగు సినీ పరిశ్రమలో ఆర్టిస్టుగా అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పారు. ఈయన తారక్ తో బాద్ షా, టెంపర్ సినిమాలను నిర్మించారు. బాద్ షా నిర్మాణ సమయంలో గణేష్ కి, ఎన్టీఆర్ కి మధ్య విభేదాలు వచ్చాయి. 55 కోట్లతో నిర్మితమయిన ఈ మూవీ ఫెయిల్ కావడంతో ఆవేశంతో నిర్మాత ఓ ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడారు. అప్పుడు ఈ గొడవ పెద్ద దుమారం రేగింది. ఆ వివాదంపై గణేష్ తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “ఎన్టీఆర్ గొప్పోడు. మంచోడు. ఎవరో చెప్పిన మాటలు విని అయన గురించి టీవీ 9 లో తప్పుగా మాట్లాడాను.
అది చూసిన మా నాన్నగారు చాలా బాధ పడ్డారు. అప్పటి నుంచి అందరి ముందు క్షమాపణలు చెప్పాలని అనుకున్నా. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ కి, ఆయన అభిమానులకు సారీ ” అంటూ క్షమాపణలు చెప్పారు. “ఫోన్లో చెబితే మా ఇద్దరి ముందే ఉంటుంది.. అందుకే మీడియా ముఖంగా తప్పుగా మాట్లాడానని ఒప్పుకుంటున్నా. బాద్ షా మూవీకి నష్టాలు వచ్చిన మాట వాస్తవమే.. అయితే టెంపర్ తో నష్టాల నుంచి బయట పడ్డాను” అని వివాదానికి తెరదించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.