Bandla Ganesh: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు బండ్లన్న.!
- August 30, 2024 / 02:42 PM ISTByFilmy Focus
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి ప్రత్యేకపరిచయం అవసరం లేదు. అతను ఏం మాట్లాడినా సెన్సేషనే..! కొన్ని సినిమా వేడుకల్లో, పబ్లిక్ ఈవెంట్స్ లో ఇతను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా బండ్ల గణేష్ చాలా యాక్టివ్ గా ఉంటారు. సామాజిక అంశాల పై తనదైన శైలిలో స్పందిస్తూనే మరోపక్క సినిమాల గురించి ఏదో ఒక కామెంట్లు చేస్తుంటారు.
Bandla Ganesh

అలాగే నచ్చని సినిమా వాళ్లపై పరోక్షంగా సెటైర్లు వేసిన సందర్భాలు కూడా అనేకం. మొన్నామధ్య హరీష్ శంకర్(Harish Shankar).. ఆ తర్వాత త్రివిక్రమ్ (Trivikram) వంటి స్టార్స్ పై బండ్లన్న సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లుగా ఎందుకో ఇతను సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. మీడియాలో కూడా ఎక్కువగా కనిపిస్తున్న సందర్భాలు లేవు. దానికి కారణాలు ఏంటో తెలీదు. ఇదిలా ఉంటే..మొత్తానికి బండ్ల గణేష్ కొంత గ్యాప్ తర్వాత మీడియా ముందుకు రాబోతున్నారు.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) చిత్రం 4K లో రీ- రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించి మహేష్ బాబు (Mahesh Babu) ‘మురారి’ (Murari) పేరుతో ఉన్న రికార్డుల్ని తుడిచిపెట్టాలనే డిమాండ్ పవన్ అభిమానుల నుండి ఉంది. దీంతో ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి.. దానికి హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బండ్ల గణేష్ కూడా హాజరుకాబోతున్నారు.












