నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. బంగార్రాజు ట్రైలర్ లో నాగచైతన్యకు ఎక్కువ ప్రాధాన్యత దక్కడంతో కొంతమంది ఈ సినిమాలో నాగార్జున రోల్ గెస్ట్ రోల్ అని కామెంట్లు చేస్తుండగా నాగచైతన్య మాత్రం ఈ సినిమాలో నాగార్జున రోల్ గెస్ట్ రోల్ కాదని క్లారిటీ ఇచ్చేశారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం నాగార్జున బంగార్రాజు సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నారు. సోగ్గాడే చిన్నినాయన మూవీలో నాగార్జున తండ్రీకొడుకుల పాత్రలలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమాలో మాత్రం తాతామనవళ్ల కథను ప్రధానంగా చూపించనున్నారు. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో బంగార్రాజు కొడుకు అయిన రామ్ పాత్ర బంగార్రాజు సినిమాలో కూడా ఉంటుందని రామ్ పాత్ర సినిమా స్టార్టింగ్, క్లైమాక్స్ లో ఉంటుందని సమాచారం. క్లైమాక్స్ లో ఈ పాత్ర ఎంట్రీనే ట్విస్ట్ గా ఉంటుందని ఈ పాత్రకు ఫైట్ కూడా ఉండేలా కళ్యాణ్ కృష్ణ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి.
సంక్రాంతి పండుగకు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని భావించే ప్రేక్షకులకు బంగార్రాజు సినిమా ఫస్ట్ ఛాయిస్ గా నిలవనుంది. తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లు దక్కాయని తెలుస్తోంది. నాగార్జున తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించారు. అందువల్ల ఈ సినిమా సులభంగానే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా తక్కువ సమయంలోనే ఓటీటీలో వస్తుందని జరిగిన ప్రచారాన్ని సైతం మేకర్స్ ఖండించారు.
ఈ సినిమా డిజిటల్ హక్కులు జీ5 ఓటీటీ దగ్గర ఉన్నాయి. బంగార్రాజు థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాతే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి క్లారిటీ వస్తుంది. నాగార్జున, నాగచైతన్య కెరీర్ లో బంగార్రాజు బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.