అల్లరి నరేష్ హీరోగా పూజా జవేరి హీరోయిన్ గా.. ‘ఏ.టీవీ’ సమర్పణలో ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘బంగారు బుల్లోడు’. ప్రభాస్ శ్రీను, భద్రం, నటి రజిత వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నిజానికి 2 ఏళ్ళ క్రితమే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి…ఎట్టకేలకు జనవరి 23న విడుదలయ్యింది. ఇది వరకు మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్న అల్లరి నరేష్.. ఈ మధ్యకాలంలో సరైన హిట్టు అందుకోలేకపోతున్నాడు. కనీసం ఓపెనింగ్స్ కూడా అతని చిత్రాలకు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ విషయం ‘బంగారు బుల్లోడు’ తో మరోసారి ప్రూవ్ అయ్యింది.గత శనివారం నాయుడు విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో మినిమం ఓపెనింగ్స్ కూడా నమోదవ్వలేదు.నిన్న అంటే రిపబ్లిక్ డే హాలిడే ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది ఈ చిత్రం.
ఇక ‘బంగారు బుల్లోడు’ చిత్రం 4 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం | 0.44 cr |
సీడెడ్ | 0.28 cr |
ఉత్తరాంధ్ర | 0.22 cr |
ఈస్ట్ | 0.12 cr |
వెస్ట్ | 0.10 cr |
కృష్ణా | 0.10 cr |
గుంటూరు | 0.13 cr |
నెల్లూరు | 0.07 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 1.46 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.04 cr |
ఓవర్సీస్ | 0.02 Cr |
టోటల్ వరల్డ్ వైడ్ : | 1.52 cr (షేర్) |
‘బంగారు బుల్లోడు’ చిత్రానికి 3.5కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 4కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 1.52 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి మరో 2.48 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నిన్న ఈ చిత్రం కేవలం 0.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
Click Here To Read Movie Review
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!