అనుష్క కి మనఃశాంతిని దూరం చేస్తున్న వారెవరో తెలుసా ?
- May 20, 2017 / 12:11 PM ISTByFilmy Focus
బాహుబలి కంక్లూజన్ 1500 కోట్లు కొల్లగొట్టడంతో చిత్ర యూనిట్ మొత్తం ఆనంద పడుతుంటుంటే.. అందులో దేవసేనగా నటించిన అనుష్క మాత్రం బాధపడుతోంది. సినిమా విజయాన్ని ఆస్వాదించలేక పోతోంది. కారణం ఎవరు అంటే హిందీ మీడియా. బాహుబలి 2 విడుదలయిన కొత్తల్లో ప్రభాస్, అనుష్క మధ్య కెమిస్ట్రీ సూపర్ అని రాసిన హిందీ పత్రికలూ.. ఇప్పుడు వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు ప్రచురిస్తున్నాయి. కొన్ని వెబ్ సైట్స్ అయితే అనుష్కకు ఓ నిర్మాతతో అక్రమ సంభంధం అంటగడుతున్నాయి. ఈ వార్తలను చూసిన స్వీటీ తెగ బాధపడినట్లు తెలిసింది. ఈ విషయాన్నీ రీసెంట్ గా ఆమె వెల్లడించింది.
ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “సినీ స్టార్స్ అంటే కొంత మేర గాసిప్స్ వస్తుంటాయి. అది కామన్. వాటిని లైట్ తీసుకుంటాము. కానీ కొంతమంది పరిధులు దాటి ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు. వాటిని చూసినప్పుడు చాలా బాధ కలుగుతోంది” అని తన ఆవేదనను బయటికి చెప్పుకుంది. అనుష్క చెప్పిన తర్వాత నైనా బాలీవుడ్ మీడియా రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












