Bellamkonda Sreenivas: మరో పాన్ ఇండియా ప్రాజెక్టు సెట్ చేసుకున్న బెల్లంకొండ..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్… మిడ్ రేంజ్ హీరోకి ఎక్కువ, స్టార్ హీరోకి తక్కువ అన్నట్టు ఉంటుంది ఇతని సినిమాల సెలక్షన్. ఇతని సినిమాలకి రూ.35 కోట్ల వరకు మార్కెట్ ఉంటుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.25 కోట్ల వరకు రికవరీ అయిపోతుంటాయి. అది వి.వి.వినాయక్ వేసిన బేస్మెంట్ అనుకోవాలి..! ప్రస్తుతం ఇతను ‘ఛత్రపతి’ హిందీ రీమేక్లో నటిస్తున్నాడు. హిందీలో శ్రీనివాస్ కు ఇది డెబ్యూ మూవీ. అతన్ని తెలుగులో హీరోగా లాంచ్ చేసిన వి.వి.వినాయకే.. హిందీలో కూడా లాంచ్ చేస్తున్నాడు.

Click Here To Watch Now

ఒక్క హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ఏక కాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అంటే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మళ్ళీ చూడాల్సిందేననమాట. ఇదిలా ఉండగా… ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో పాటు ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్టుని లైన్లో పెట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘భీమ్లా నాయక్’ నిర్మాతలైన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఇందులో చాలా మంది స్టార్లు నటించబోతున్నారట. భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు తెరకెక్కనుందని సమాచారం. అనౌన్స్మెంట్ తర్వాత అందరూ ఆశ్చర్యానికి గురవ్వడం గ్యారెంటీ అనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి అంతలా ఈ మూవీలో ఏ స్టార్లు నటించబోతున్నారో తెలియాల్సి ఉంది. దర్శకుడి పేరు కూడా ఇంకా బయటకి రాలేదు.

మరో పక్క ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కు ఫస్ట్ లుక్ కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి కానీ టైటిల్ ఇంకా సెట్ కాలేదు. ‘ఛత్రపతి’ ‘శివాజీ’ వంటి టైటిల్స్ ఆల్రెడీ ఇంకొకరు రిజిస్టర్ చేయించుకుని పెట్టుకున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus