తమ్ముడి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరో
- January 4, 2021 / 09:37 PM ISTByFilmy Focus
బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి త్వరలో మరొక హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు అయితే వస్తున్నాయి. కానీ హీరో మాత్రం రావడం లేదు. సీనియర్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు టాలీవుడ్ మాస్ హీరోగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే బాలీవుడ్ లో కూడా మొదటి అడుగు వేయబోతున్నాడు. ఛత్రపతి కథను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వివి.వినాయక్ డైరెక్ట్ చేయనున్న ఆ సినిమాను బాలీవుడ్
ఆడియెన్స్ ఎంతవరకు ఆదరిస్తారు అనేది చూడాలి. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ తన బిగ్ డ్రీమ్ గురించి వివరణ ఇచ్చాడు. తన తమ్ముడు గణేష్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే తన బిగ్ డ్రీమ్ అంటూ వచ్చే ఏడాది అతని ఎంట్రీ ఉంటుందని అన్నాడు. అసలైతే బెల్లంకొండ గణేష్ గత ఏడాది ఒక సినిమాను చేయబోతున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. పవన్ సాధినేని డైరెక్టర్ అని కూడా క్లారిటీ ఇచ్చారు.

కానీ ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇంతవరకు ఇవ్వలేదు. సినిమా ఆగిపోయినట్లు అప్పట్లోనే రూమర్స్ వచ్చాయి. ఇక త్వరలో ఒక కమర్షియల్ మాస్ డైరెక్టర్ తోనే బెల్లంకొండ గణేష్ సినిమా ఉంటుందని సమాచారం.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!












