‘అర్జున్ సురవరం’ దర్శకుడితో బెల్లంకొండ!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా.. చెప్పుకోదగ్గ హిట్స్ అయితే పడలేదు. ‘రాక్షసుడు’ సినిమా పర్వాలేదనిపించింది. అతడు చివరిగా ‘అల్లుడు శ్రీను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో కొన్నాళ్లపాటు బ్రేక్ తీసుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ లో ‘ఛత్రపతి’ రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

పెన్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బెల్లంకొండ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. మధ్యలో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ అదే ప్రాజెక్ట్ ను రవితేజ కూడా చేస్తుండడంతో బెల్లంకొండ డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు మరో కొత్త సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది.

నిఖిల్ హీరోగా తెలుగులో ‘అర్జున్ సురవరం’ అనే సినిమాను తెరకెక్కించారు టీఎన్ సంతోష్. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు దర్శకుడు సంతోష్. ఈ సెప్టెంబర్ నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. పలు భాషల్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ‘ఛత్రపతి’ రీమేక్ రిజల్ట్ ను బట్టి ఈ సినిమాను ఏ స్కేల్ లో తెరకెక్కించాలో డిసైడ్ అవుతారు.

ప్రస్తుతానికైతే షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి. ఇక రీసెంట్ గా ‘ఛత్రపతి’ సినిమా గురించి మాట్లాడిన బెల్లంకొండ సినిమా అవుట్ పుట్ విషయంలో టీమ్ మొత్తం చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus