టాలీవుడ్ ఎంట్రీకే తగ్గలేదు..ఇక బాలీవుడ్ ఎంట్రీకి ఏం తగ్గుతాడు..!

  • November 19, 2020 / 09:06 PM IST

టాలీవుడ్లో ఫేస్ వాల్యూ ఉన్న హీరోల సినిమాలను హిందీలోకి డబ్ చేసి.. యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేస్తుంటే.. వాటికి 100మిలియన్ల వ్యూస్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు వాటిని లోకల్ ఛానల్స్ లో టెలికాస్ట్ చెయ్యగా రికార్డు టి.ఆర్.పి లను నమోదు చేస్తున్నాయి. ఈ లిస్టులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇక్కడ ప్లాపైన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు అక్కడ రికార్డులు సృష్టిస్తుండడం విశేషం.

అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో స్ట్రైట్ బాలీవుడ్ సినిమాని నిర్మించాలని అక్కడి నిర్మాతలు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో ఓ నిర్మాత శ్రీనివాస్ తో ‘ఛత్రపతి’ సినిమాని రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అందుకు గాను ‘సాహో’ దర్శకుడు సుజీత్ ను సంప్రదించారట. కానీ అతను ఈ ప్రాజెక్టు చెయ్యడానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు మరో దర్శకుడి కోసం గాలిస్తున్నారని సమాచారం. ఇక టాలీవుడ్లో హీరోగా లాంచ్ అవ్వడానికే..

సమంత, తమన్నా వంటి హీరోయిన్లను రంగంలోకి దింపారు. అలాంటిది బాలీవుడ్ ఎంట్రీకి చిన్న హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారా? అందుకే ఏకంగా సారా అలీ ఖాన్, అనన్య పాండే వంటి బాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ ను రంగంలోకి దింపుతున్నారని సమాచారం. ఈ చిత్రం కోసం ఏకంగా రూ.80 కోట్ల నుండీ రూ.100 కోట్ల వరకూ బడ్జెట్ ను అనుకుంటున్నారట అక్కడి నిర్మాతలు.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus