టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా పేరొందిన సమంత (Samantha) కెరీర్ ప్రారంభంలోనే అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయితే, ఆమె ధైర్యం, పట్టుదల వల్లనే ఈ స్థాయికి చేరుకుంది. తాజాగా, ఆమె కెరీర్‌లో జరిగిన ఓ ఆసక్తికర ఘటనపై నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) ఓపెన్ అయ్యారు. అల్లుడు శీను (Alludu Seenu) సినిమా సమయంలో సమంత చర్మ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు బెల్లంకొండ వెల్లడించారు. షూటింగ్ సమయంలో ఈ అనారోగ్య సమస్య సినిమా తాత్కాలికంగా నిలిపివేయాలనే స్థితికి తీసుకెళ్లిందట.
Bellamkonda Suresh
ఈ పరిస్థితుల్లో సమంతకు బెల్లంకొండ సురేష్ ఆర్థిక సహాయం చేస్తూ సపోర్ట్ చేశారు. 25 లక్షల సాయం అందించి, చికిత్స కోసం హైదరాబాద్లో పార్క్ హయత్ హోటల్‌లో ప్రత్యేక రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సహాయం ఆమెను మానసికంగా, శారీరకంగా కాస్త ఉపశమనానికి దారితీసిందని నిర్మాత పేర్కొన్నారు. సమంత తన ఆరోగ్య సమస్యలపై ఎప్పుడూ తెరమీద మాట్లాడకపోయినా, ఆమె ధైర్యం ప్రతి విషయంలో కనిపిస్తుంది.
బెల్లంకొండ చేసిన ఈ సాయం సమంత కెరీర్‌లో ఒక జ్ఞాపకంలా నిలిచింది. ఈ సంఘటన తర్వాత సమంత, బెల్లంకొండ కుటుంబంతో మంచి సంబంధాలను కొనసాగిస్తోందట. ఇప్పటికీ ఆమె ఆ సంఘటనను మర్చిపోకపోవడం ఆప్యాయతకు నిదర్శనం. ఇకపోతే, సమంత ఇటీవల మయోసైటిస్ వ్యాధితో పోరాడుతోంది. ఈ సమయంలో కూడా ఆమె సిటాడెల్ వంటి భారీ ప్రాజెక్టుల్లో పని చేయడం, ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవడం గొప్ప విషయమే.
తాను ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల్లోనూ, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎదగడం సమంతను ప్రత్యేకంగా నిలిపింది. ప్రస్తుతం ఆమె కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. సొంత బ్యానర్ లో కూడా చిత్రాలు చేయడం, వెబ్ సిరీస్‌లలో కనిపించడం, కొత్త పాత్రలను ఎంచుకోవడం చూస్తుంటే, ఆమె భవిష్యత్తు మరింత బాయ్ లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు.