టాలీవుడ్లో ఉన్న పాత్ బ్రేకింగ్ దర్శకుల్లో సుకుమార్ (Sukumar) కూడా ఒకరు. రెగ్యులర్ ఫార్మాట్లో సినిమాలు తీయడం ఈయనకి నచ్చదు. స్వతహాగా లెక్కల మాస్టారు కావడంతో మొదటి నుండి సినిమా విషయంలో ఈయనకి డిఫరెంట్ కాలిక్యులేషన్స్ ఉన్నాయి. అలా ఆయన ఆలోచనలు, కాలిక్యులేషన్స్ నుండి పుట్టినవే ‘ఆర్య’ (Aarya) ‘జగడం’ (Jagadam) ‘ఆర్య 2’ (Arya 2) ‘100 పర్సెంట్ లవ్’ (100% Love) ‘1 నేనొక్కడినే’ (1: Nenokkadine) ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho) వంటి సినిమాలు. ఇందులో ‘1 నేనొక్కడినే’ తీసేస్తే.. మిగిలిన 4 సినిమాల జోనర్లు అందరికీ తెలిసినవే.
Sukumar
కాకపోతే ట్రీట్మెంట్ సుకుమార్ స్టైల్లో ఉంటుంది. ఇక సుకుమార్ ని స్టార్ డైరెక్టర్ ను చేసింది ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమా అని అంతా అంటూ ఉంటారు. నిజమే.. కానీ ‘రంగస్థలం’ సినిమా సుకుమార్ తీశాడు అంటే మొదట్లో అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ సినిమాలో మాస్ అప్పీల్ ఓ రేంజ్లో ఉంటుంది. సుకుమార్ మాస్ సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద ఎలా పేలుతుందో? నిరూపించిన సినిమా అది. అయితే సుకుమార్ ‘రంగస్థలం’ తీయడానికి కారణం ‘1 నేనొక్కడినే’ సినిమా. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.
కానీ దాని తర్వాత సుకుమార్ కి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ‘నాన్నకు ప్రేమతో’ నుండి ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) వరకు సుకుమార్ తీసిన సినిమాలు అన్నీ బాగానే ఆడాయి. ‘1 నేనొక్కడినే’ డిజాస్టర్ అయినా మిగిలిన సినిమాలు ఆడడానికి కారణం… ఆ సినిమానే అని సుకుమార్ పరోక్షంగా పలు సందర్భాలు చెప్పుకొచ్చాడు. దానికి కారణం ఏంటంటే.. ‘1 నేనొక్కడినే’ సినిమాతో సుకుమార్ కేవలం ప్లాప్ ఫలితం మాత్రమే చూడలేదు. చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే.. ఆ సినిమా టేకింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది.
పైగా అది రిలీజ్ అయ్యింది కూడా సంక్రాంతి సీజన్లో. ఆ టైంలో ఆడియన్స్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలనే చూడటానికి ఇష్టపడతారు కానీ మెదడుకు పని చెప్పే ‘1 నేనొక్కడినే’ వంటి సినిమాలు చూడటానికి ఇష్టపడరు. అందువల్ల ఆ సినిమాని ఎక్కువగా తిట్టి పోసింది మాస్ ఆడియన్స్. అందుకే మాస్ ఆడియన్స్ పై సుకుమార్ స్పెషల్ ఫోకస్ పెట్టాడట. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కూడా టిపికల్ గా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ (Jr NTR) మార్క్ మాస్ ఎలిమెంట్స్ కొన్ని మిక్స్ చేసి బ్యాలెన్స్ చేశాడు సుకుమార్.