శ్యామ్ సింగరాయ్ లో బెంగాలీ నటుడు

నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం “శ్యామ్ సింగరాయ్”. “ట్యాక్సీవాలా” ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బెంగాలీ నటుడు జీషు సేన్ గుప్తాను ఫైనల్ చేశారు. జీషు ఇదివరకు నాగశౌర్య “అశ్వద్ధామ”, నితిన్ “భీష్మ” చిత్రాల్లో విలన్ గా నటించాడు.

బెంగాలీలో ఒన్నాఫ్ ది మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అయిన జీషు సేన్ టాలీవుడ్ లోనూ బిజీ ఆర్టిస్ట్ అవుతున్నాడు. ప్రస్తుతం “శ్యామ్ సింగరాయ్” షూటింగ్ కలకత్తా దగ్గరలోని ఓ గ్రామంలో జరుగుతోంది. ఇదే ఫైనల్ షెడ్యూల్. సొ, జీషు సేన్ ది పెద్ద రోల్ ఉండకపోవచ్చు. ఇకపోతే.. ఈ చిత్రంలో ఒక ఎక్స్ పెక్ట్ చేయని నటుడు ఉంటాడని గుసగుసలు వినబడుతున్నాయి. “గూఢచారి”లో జగపతిబాబు తరహాలోనే ఈ సినిమాలోనూ విడుదలయ్యేవరకు ఒక పర్టీక్యులర్ ఆర్టిస్ట్ నేమ్ రివీల్ చేయకుండా సీక్రెట్ గా ఉంచాలని ప్లానింగ్ లో ఉన్నారు శ్యామ్ సింగరాయ్ టీం.

మరి వాళ్ళ ఆలోచన ఎంతవరకు వర్కవుట్ అవుతుంది, వాళ్ళు ఊహించిన స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది తెలియదు కానీ.. సినిమా మీద మాత్రం మంచి హోప్స్ క్రియేట్ అయ్యాయి ఫస్ట్ లుక్ పోస్టర్ తో. సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ లేదు. “టక్ జగదీష్” విడుదల అనంతరం “శ్యామ్ సింగరాయ్” డేట్ ను ఎనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో నాని సిపాయిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. బ్రిటిష్ కాలం నాటి యువరాణిగా సాయిపల్లవి కనిపించబోతోందట.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus