తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ హీరోల్లో నాని కి ప్రత్యేకమైన శైలి ఉంది. పక్కింటి కుర్రోడిలా అనిపించే క్యారెక్టర్స్ ఎంచుకోవడం.. ఆ పాత్రలో అంతే సహజంగా నటించడం అతనికి అలవాటు. అందుకే నాని నేచురల్ స్టార్ అని పిలిపించుకుంటున్నారు. అతని సినిమాల్లోని కొన్ని సన్నివేశాల్లో నాని నటన పీక్స్ లో ఉంటాయి. అటువంటి సన్నివేశాలపై ఫోకస్..
1. సుబ్బు (ఎవడే సుబ్రహ్మణ్యం)ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సుబ్బు పాత్రకి నాని వంద శాతం న్యాయం చేశారు. విశ్రాంతి తర్వాత వచ్చే తనని తాను తెలుసుకునే సన్నివేశాల్లో నాని అద్భుతంగా నటించారు.
2. ఉమా (నిన్నుకోరి)సరదాగా నవ్వించే నాని నిన్నుకోరి సినిమాలో ఉమా రోల్లో కంటతడి పెట్టించారు. “తనే జీవితం అనుకున్న” అని నాని డైలాగ్ చెబుతుంటే కళ్ళు చెమర్చుతాయి.
3. ప్రవీణ్ (పిల్ల జమీందార్)పిల్ల జమీందార్ చిత్రంలో ప్రవీణ్ గా నాని మెప్పించారు. ముఖ్యంగా తన తెలుగు మాస్టారు ప్రాణాపాయంలో ఉంటే అప్పుడు ప్రవీణ్ గా నటన, చెప్పిన డైలాగులు మరువలేము.
4. బాబు (నేను లోకల్)నేను లోకల్ సినిమాలో బాబు గా నాని చలాకీగా ఉంటూ క్లైమాక్స్ లో కేక పుట్టించారు. క్లైమాక్స్ లో నాని నటన అమోఘం.
5. గౌతమ్ (అలా మొదలైంది) అలా మొదలైంది సినిమాలో నాని గౌతమ్ గా అనేక సన్నివేశాల్లో మెప్పించారు. గే పాత్రలో అయితే నవ్వులు పూయించారు.
6. జై, గౌతమ్ (జెంటిల్ మాన్)జెంటిల్ మాన్ సినిమాలో నాని.. జై, గౌతమ్ పారలు పోషించారు. తాను జై కాదు గౌతమ్ అని చెప్పునే సమయంలో నాని నటన అద్భుతహా అనిపిస్తుంది.
7. లక్కీ (భలే భలే మగాడివోయ్)భలే భలే మగాడివోయ్ చిత్రంలో లక్కీ మతిమరుపు గురించి తెలిసిపోయినప్పుడు.. ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడే సీన్ లో అందరినీ ఏడిపించేస్తాడు.
8. కృష్ణ (కృష్ణ గాడి వీర ప్రేమ గాధ)కృష్ణ గాడి వీర ప్రేమ గాధ క్లైమాక్స్ లో హీరోయిన్ ని చంపేశా అని విలన్ చెప్పినపుడు ఒక 10 సెకన్లు నాని (కృష్ణ) పలికించిన హావభావాలు ఏదైతే ఉందో అది మాటల్లో చెప్పలేనిది.