తెలుగు చిత్రాల్లో కథ లేకపోయినా ప్రేక్షకులు బాధపడరు.. కానీ ఐటెం సాంగ్ లేకపోతే మాత్రం తెగ ఫీలై పోతుంటారు. ఆడియన్స్ కోరికమేరకు నిర్మాతలు ఎంత ఖర్చైనా సరే స్పెషల్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో గ్లామర్ బొమ్మలతో పాటు, టాప్ హీరోయిన్లు కూడా ప్రత్యేక గీతాలతో అదర గొట్టారు. సినీ జనులకు అందాల విందును పంచారు. అలా 2016 లో ఉర్రుతలూగించిన ఐటెం సాంగ్స్ పై ఫోకస్..
పక్కా లోకల్ (కాజల్ అగర్వాల్)
ఈ సంవత్సరం కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన చిత్రాలు మంచి పేరుని తీసుకు రాలేనప్పటికీ ఒక్క ఐటెం సాంగ్ వార్తల్లో నిలిచేలా చేసింది. జనతా గ్యారేజ్ మూవీలో ఆమె చేసిన పక్కా లోకల్ పాట మాస్ ప్రేక్షకుల నోట మారు మోగింది. టాప్ హీరోయిన్ ఈ సాంగ్ లో నటించడంతో రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కాజల్ ప్రత్యేక గీతంలో కనిపించడం ఇదే తొలిసారి.
‘బ్లాకు బస్టరే…’(అంజలి)
‘సరైనోడు’లో ‘బ్లాకు బస్టరే…’ పాటలో అంజలి అందాలు ఆరబోత మంచి రిలీఫ్ ని ఇచ్చింది. ఆ సినిమా విజయంలో ఆ పాటకూ కొంత స్థానం దక్కిందనడంలో అతిశయోక్తిలేదు. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కి పోటీగా అంజలి స్టెప్పులు వేసింది.
‘తోబ తోబ…’ (రాయ్ లక్ష్మీ)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ లో ‘తోబ తోబ…’ పాట అందరికీ కిక్ ఇచ్చింది. ఐటెమ్ గీతాలకు కేరాఫ్‌గా నిలిచిన రాయ్ లక్ష్మీ మరోసారి ఆ పాత్రలో జీవించేసింది. పవన్ పక్కన అందాలు ఆరబోస్తూ మాస్ పల్స్ రేట్ ఒక్కసారిగా పెంచేసింది.
‘టాక్సీవాలా…’ (శ్రుతి సోడి)
కళ్యాణ్ రామ్ పటాస్ లో హీరోయిన్ గా నటించిన శ్రుతి సోడి ఈ ఏడాది స్పెషల్ సాంగ్ లో అలరించింది. ‘సుప్రీమ్’లో ‘టాక్సీవాలా…’ పాటలో సాయిధరమ్ తేజ్ తో కలిసి శ్రుతి సోడి స్టెప్పులేసింది. సినిమాను తన అందాలతో ఆరంభించింది.
బ్యాచిలర్ బాబు (తమన్నా)
ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే ప్రత్యేక గీతాల్లో నర్తించే మిల్కీ బ్యూటీ తమన్నా ఈఏడాది కూడా ఐటెమ్ గీతాల్లో తన హవా చూపించింది. ‘స్పీడున్నోడు’ లో బ్యాచిలర్ బాబు అంటూ యువతకు శృంగార పాఠాలు చెప్పేసింది. ‘జాగ్వార్’లో మందార తైలంతో మసాజ్ చేసిన అది పెద్దగా మత్తు ఇవ్వలేకపోయింది.
‘టింగో టింగో…’(ముమైత్ ఖాన్)
“ఇప్పటికింకా నా వయసు నిండా పదహారు” అంటూ కుర్ర కారుని ఊపు ఊపిన ముమైత్ ఖాన్ చాలా కాలం తర్వాత డిక్టేటర్ సినిమాలో ‘టింగో టింగో…’ అంటూ స్టెప్పులేసింది. ఇందులో శ్రద్ధా దాస్ కూడా అందాలతో ఊరించింది. వీరిద్దరి ఒకే పాటలో చూసేందుకు మాస్ అభిమానులకు రెండు కళ్ళు సరిపోలేదు.
‘డోర్ నెంబర్…’ (నోరా ఫతేహీ)
క్లాస్ సినిమాగా తెరకెక్కిన ఊపిరి చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ అల్లాడించింది. ‘డోర్ నెంబర్…’ అంటూ నోరా ఫతేహీ మెలికలు తిరుగుతుంటే.. ఆహా.. ఓహో.. ఏహీ.. అనడం ప్రేక్షకుల వంతయింది. ఐటెం నెమలి అందాలు చల్లి అగ్గిమంట పెట్టేసింది.
కొలతలు.. కొలతలు (సాక్షి చౌదరి)
అల్లరి నరేష్ చిత్రం ‘సెల్ఫీ రాజా’లో ఓ హీరోయిన్ పాత్రలో నటిస్తూనే ఐటెం సాంగ్ తో సాక్షి చౌదరి కవ్వించింది. కొలతలు.. కొలతలు అంటూ డబల్ మీనింగ్ పాటలో మైమరపింపజేసింది.
దేశీ గర్ల్ (హంసానందిని)
కుటుంబ కథ చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’ లోను ఐటెం సాంగ్ చేర్చారు. ఇందులోని “దేశీ గర్ల్” పాటలో హంసానందిని వయ్యారంగా నడుము ఊపుతూ కనువిందు చేసింది.