2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ.. వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. 2025లోనూ ఏకంగా 250కి పైగా చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో కంటెంట్ పరంగా ఆకట్టుకున్న సినిమాలేంటి అనేది చూద్దాం.

Best Telugu Movies of 2025

గమనిక: ఈ చిత్రాల ఎంపిక కేవలం కంటెంట్ క్వాలిటీ బట్టి మాత్రమే జరిగింది. బాక్సాఫీస్ లెక్కలు లేదా సోషల్ మీడియా పాపులారిటీ బట్టి కాదు.

1) డాకు మహారాజ్

సంక్రాంతి రేసులో విడుదలైన బాలయ్య సినిమాకి అంటేనే ఒక ఆసక్తి. అందులోనూ టెక్నికల్ గా ఒక బెటర్ బాలయ్య సినిమా చూసి చాలా కాలమైంది. ఫస్టాఫ్ అయ్యేసరికి సినిమా ఇది బాలయ్య “జైలర్” అని ఫిక్స్ అయ్యి.. బాలయ్య మరో ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు అనుకున్నాం. కట్ చేస్తే.. సెకండ్ హాఫ్ పూర్తిస్థాయిలో అలరించలేక.. బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా, డీసెంట్ హిట్ తో సరిపెట్టుకుంది. ఇప్పటికే సినిమాటోగ్రఫీ వర్క్ & బీజియం కోసమైనా “డాకు మహారాజ్”ను మల్టిపుల్ టైమ్స్ చూడొచ్చు. (Click Here For Review)

OTT Platform: Netflix

2) సంక్రాంతికి వస్తున్నాం

2025 సంక్రాంతి రేసులో నిలబడ్డ ఈ సినిమా అంటే ఎందుకో ముందు నుండీ చిన్నచూపు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి సినిమాల నడుమ ఈ సినిమాని పట్టించుకుంటారా? అనుకున్నారు అందరూ. కట్ చేస్తే.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాక, రీజనల్ సినిమాల్లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది చిత్రం. దీన్నిబట్టి రీజనల్ కామెడీకి ఉన్న స్కోప్ ఏంటి అనేది అర్థమైంది ఇండస్ట్రీకి. అనిల్ రావిపూడికి దర్శకుడిగా ఒక రెస్పాక్ట్ తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. (Click Here For Review)

OTT Platform: Z5

3) గాంధీ తాత చెట్టు

కాన్సెప్ట్ సినిమాలు మన తెలుగులో ఈమధ్య బాగా తగ్గుతున్నాయి. అందుకు కారణాలు ఏవైనా.. మీడియం రేంజ్ సినిమాల్లో ఈ జోనర్ సినిమాలు తగ్గడం అనేది బాధాకరం. అయితే.. పద్మావతి మల్లాది తెరకెక్కించిన “గాంధీ తాత చెట్టు” సినిమా మనకి అహింసావాదం యొక్క గొప్పదనం తెలియజేస్తూనే.. చిన్నపిల్లల్లో ఉండే అమాయకత్వం అనేది ఎంత అమూల్యమైనది అనే విషయాన్ని తెలియజెప్పిన మంచి సినిమా ఇది. (Click Here For Review)

OTT Platform: Prime Video

4) 23 – ఇరవై మూడు

రాజ్ రాచకొండ లాంటి సిన్సియర్ ఫిలిం మేకర్.. తాను చెప్పాలనుకున్న కథను నిజాయితీతో తెరకెక్కిస్తాడు. ఒక మనిషి యొక్క కులం, వర్గం, స్థాయిని బట్టి న్యాయ వ్యవస్థ ఎలా సహకరిస్తుంది అనే విషయాన్ని చాలా ప్రస్పుటంగా చెప్పాడు రాజ్ రాచకొండ. ఇది రియాలిస్టిక్ సినిమా. (Click Here For Review)

OTT Platform: Prime Video

5) నారీ: ది ఉమెన్

ఫీమేల్ మొలెస్టేషన్ ను ఇప్పటికే చాలా విధాలుగా డీల్ చేసింది మన ఇండియన్ సినిమా. కానీ.. ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని విధంగా ఒక తల్లి నేర్పిన గుణపాఠం అనేది ఒక అబ్బాయి ఆలోచనాధోరణిని ఎలా మార్చింది అనేది “నారీ” సినిమాలో కీలకమైన పాయింట్. థియేటర్లో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఆమని కెరీర్ లో ఒన్నాఫ్ ది బెస్ట్ & డేరింగ్ పెర్ఫార్మెన్స్ ఇది. (Click Here For Review)

OTT Platform: NA

6) కోర్ట్

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా “కోర్ట్” డైరెక్టర్ రామ్ జగదీశ్ రచనా శైలి ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ కాగా.. మంగపతిగా శివాజీ నటన ఈ సినిమాని ఆడియన్స్ కి చేరువ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే.. నాని బ్రాండ్ అనేది సినిమాపై జనాలు ఆసక్తి చూపంలో కీలకపాత్ర పోషించింది. (Click Here For Review)

OTT Platform: Netflix

7) మ్యాడ్ స్క్వేర్

సీక్వెల్ కారణంగా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. దాన్ని క్యాష్ చేసుకోవడంలో మంచి విజయం సాధించారు దర్శకుడు కల్యాణ్ శంకర్ & నిర్మాత నాగవంశీ. పెళ్లి, మాఫియా, గోవా చుట్టూ తిరిగే ఈ కథ ఆడియన్స్ ను హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసింది. (Click Here For Review)

OTT Platform: Netflix

8) కుబేరా

అసలు శేఖర్ కమ్ముల నుండి ఊహించని శైలి సినిమా ఇది. ఆయన కమ్యూనిస్టు మైండ్ సెట్ అనేది చాలా స్పష్టంగా సినిమా ద్వారా కనిపిస్తుంటుంది. ధనుష్, నాగార్జున, రష్మికల అద్భుతమైన నటనకి దేవిశ్రీప్రసాద్ సరికొత్త సౌండ్ తోడై మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి. (Click Here For Review)

OTT Platform: Prime Video

9) 8 వసంతాలు

ఈ సినిమాని కొన్ని అనవసరమైన కాంట్రవర్సీలు చుట్టుముట్టి.. సినిమా యొక్క స్థాయికి తగ్గ విజయాన్ని అందుకోకుండా చేశాయి కానీ.. హీరోయిన్ క్యారెక్టర్, సంగీతం, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ పరంగా ఇంకాస్త బెటర్ రిసెప్షన్ అందుకోవాల్సిన సినిమా ఇది. శుద్ధి అయోధ్యగా ఆనంతిక నటన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. (Click Here For Review)

OTT Platform: Netflix

10) మహావతార్ నరసింహ

నిజానికి ఈ యానిమేటెడ్ సినిమా విడుదలవుతున్నప్పుడు కనీస స్థాయి అంచనాలు లేవు. తెలుగులో యానిమేషన్ ఎవరు చూస్తారు? అది కూడా దేవుడి సినిమా అనే ఆలోచనే అందరి మనసులో. కట్ చేస్తే.. తెలుగులో టాప్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. క్రెడిట్ మొత్తం దర్శకుడు అశ్విన్ దే. ఒక్కడే ఏళ్ల తరబడి కష్టపడి ఈ సినిమాని సృష్టించాడు. (Click Here For Review)

OTT Platform: Netflix

11) లిటిల్ హార్ట్స్

నటీనటులందరూ దాదాపుగా కొత్తవాళ్లే. కొందరు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయితే.. ఇంకొందరు ప్యాడింగ్ ఆర్టిస్టులు. కానీ.. సినిమాలో ఉన్న కొత్తదనం, తమను తాము చూసుకోగల పాత్రలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. సాయి మార్తాండ్ తీత, మౌళి, శివానీ, జయకృష్ణల నటన & టైమింగ్ ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి. (Click Here For Review)

OTT Platform: Etv Win & Netflix

12) మిరాయ్

గ్రాఫిక్స్ పరంగా ఈ చిత్రం ఆశ్చర్యపరిచినట్లుగా.. 100 కోట్లతో తెరకెక్కించిన సినిమాలు కూడా అలరించలేదు. జటాయు పక్షి గ్రాఫిక్స్ కానీ, యాక్షన్ బ్లాక్ కానీ అద్భుతంగా ఉంటాయి. కార్తీక్ ఘట్టమనేని వర్క్, తేజ సజ్జా స్క్రీన్ స్పేస్ మరియు గౌర హరి మ్యూజిక్ ఈ సినిమాకి మేయిస్ ఎసెట్స్. (Click Here For Review)

OTT Platform: Netflix

13) బ్యూటీ

చిన్న సినిమా అయినప్పటికీ.. కథలోని నిజాయితీ, నటీనటుల పెర్ఫార్మెన్సులు ఈ సినిమాని స్పెషల్ గా నిలిపాయి. తండ్రిగా నరేష్ నటన, కంగారుపడే జెన్ జీ అమ్మాయిగా నిలాఖి పెర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే.. అంకిత్ కొయ్య కూడా మంచి నటనతో అలరించాడు. సమాజం అమ్మాయిలకి ఎంత డేంజరస్ గా ఉంది అనేది ఈ సినిమాతో దర్శకుడు వివరించిన విధానం ప్రశంసార్హం. (Click Here For Review)

OTT Platform: Z5

14) దే కాల్ హిమ్ ఓజీ

పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక పీక్ యాంటిసిపేషన్ చూసిన సినిమాల్లో ఓజీ ఒకటి. సుజీత్ రైటింగ్, కళ్యాణ్ లుక్స్ & స్టైలింగ్, తమన్ బీజియం అనేది సినిమాని పీక్ లెవల్ కి తీసుకెళ్లాయి. టికెట్ రేట్లు సినిమా ఫుల్ లెంగ్త్ కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపించినప్పటికీ.. కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. (Click Here For Review)

OTT Platform: Netflix

15) బాహుబలి: ది ఎపిక్

రీరిలీజ్ అంటేనే బోర్ కొట్టేసిన తరుణంలో.. రీరిలీజ్ సినిమాతో ఆడియన్స్ ను ఏ విధంగా అలరించాలి అనేది రాజమౌళి మరోసారి నిరూపించారు. బాహుబలి రెండు భాగాలను కలిపి ఒక సినిమాగా విడుదల చేయడమే కాకుండా.. కొన్ని చిన్నపాటి సీన్స్ యాడ్ చేసారు. అన్నిటికీ మించి కలరింగ్ విషయంలో తీసుకున్న కేర్ మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. (Click Here For Review)

OTT Platform: Netflix

16) ది గర్ల్ ఫ్రెండ్

ఒక సినిమా ఎంతమందికి నచ్చిందో, అంతే మందికి నచ్చకపోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. “ది గర్ల్ ఫ్రెండ్” విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాని ఎంతమంది ఓన్ చేసుకుని మెచ్చుకున్నారో, అంతేమంది తిట్టుకున్నారు కూడా. అయితే.. ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకునేందుకు ఈ చిత్రం కారణమవ్వడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. (Click Here For Review)

OTT Platform: Netflix

17) ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

చాలా తక్కువసార్లు బుర్రతో ఆలోచించకుండా.. సరదాగా చూస్తూ ఎంజాయ్ చేసే సినిమాలు వస్తుంటాయి. అటువంటి సినిమానే “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో”. తిరువీర్ ను, నరేంద్ర రవి డామినేట్ చేయడం, సురేష్ బొబ్బిలి సంగీతం, రాహుల్ చాలా చిన్న ఎమోషన్స్ ను డీల్ చేసిన విధానం బాగా వర్కవుట్ అయ్యింది. మంచి రిజనల్ ఫన్ కోసం ఈ సినిమా కుటుంబం అందరూ కలిసి చూడొచ్చు. (Click Here For Review)

OTT Platform: Z5

18) రాజు వెడ్స్ రాంబాయి

ఒక రెగ్యులర్ లవ్ స్టోరీగా మొదలై.. చిన్నపాటి షాక్ ఇచ్చిన సినిమా ఇది. సాయిలు కంపాటి దర్శకత్వాన్ని అఖిల్ రాజ్, తేజస్విల నటన డామినేట్ చేసింది. సురేష్ బొబ్బిలి సంగీతం & నేచురల్ లోకేషన్స్ ఈ సినిమాని అన్నీ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా చేశాయి. (Click Here For Review)

OTT Platform: Z5

19) ఆంధ్ర కింగ్ తాలుకా

సినిమాల్లో ఇప్పటివరకు ఫ్యాన్ ఎమోషన్ అనేది ఎందుకో పూర్తిస్థాయిలో చూపించలేదు అనుకునేవాళ్ళం. ఆ ఎమోషన్ ను వీలైంత నిజాయితీగా చూపించిన సినిమా “ఆంధ్ర కింగ్ తాలుకా”. ఉపేంద్ర, రామ్ ల నటన, వివేక్-మెర్విన్ సంగీతం సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ప్రమోషన్స్ ద్వారా ఇది ఎలాంటి సినిమా అనేది ప్రేక్షకులకు తెలియజేయడంలో మేకర్స్ తడబడడం అనేది చిన్న మైనస్. (Click Here For Review)

OTT Platform: Netflix

20) దండోరా

కుల వివక్ష లేదా వర్గ వివక్ష నేపథ్యంలో తెలుగులో ఈమధ్యకాలంలో సినిమాలు రాలేదు. ఆ లోటు తీర్చిన సినిమా “దండోరా”. ఏడాది చివర్లో వచ్చినా.. ఏడాది మొత్తం చెప్పుకొనే స్థాయి సినిమా. రచన, నటీనటుల ఎంపిక, కెమెరా వర్క్, సంగీతం ఇలా ప్రతీది సరిగ్గా కుదిరాయి. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకుంది. (Click Here For Review)

In Theatres Now

21) పతంగ్ 

లాస్ట్ లో వచ్చినా లేటెస్ట్ గా ఎంటర్టైన్ చేసిన సినిమా “పతంగ్”. నటీనటులు మొదలుకొని టెక్నీషియన్ల వరకు అందరూ దాదాపుగా కొత్తవాళ్ళే. అయినప్పటికీ.. సరికొత్త డీలింగ్ తో మెప్పించిన సినిమా ఇది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని సరికొత్తగా పతంగుల నేపథ్యంలో డీల్ చేశాడు దర్శకుడు ప్రణీత్. (Click Here For Review)

In Theatres Now

 

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus