నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా బాలకృష్ణ కూతురిగా అతి కీలకమైన పాత్రలో శ్రీలీల కనిపించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్..వంటివి సినిమా పై అంచనాలు పెంచాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు సో సోగా అనిపించాయి.
కానీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ సో సో గా నమోదైనా స్టడీగా రాణిస్తుండటంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
17.35 cr
సీడెడ్
11.73 cr
ఉత్తరాంధ్ర
5.60 cr
ఈస్ట్
3.15 cr
వెస్ట్
2.66 cr
గుంటూరు
5.16 cr
కృష్ణా
2.40 cr
నెల్లూరు
2.48 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
50.53 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
4.70 cr
ఓవర్సీస్
6.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
61.73 cr (షేర్)
‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari ) చిత్రానికి రూ.60.01 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.61 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ‘భగవంత్ కేసరి’ చిత్రం రూ.61.73 కోట్ల షేర్ ను రాబట్టి… బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.73 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.