బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) హీరోగా ‘భైరవం'(Bhairavam) అనే సినిమా రూపొందింది. విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దీనికి దర్శకుడు. ‘నాంది’ ‘ఉగ్రం’ (Ugram) సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్. ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ (K. K. Radhamohan) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. మే 30న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది ఈ సినిమా. దీనికి ‘ఎ’ రేటింగ్ ను జారీ చేశారు సెన్సార్ సభ్యులు.
అలాగే ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్దలు కూడా ‘భైరవం’ సినిమా చూశారు. సినిమా అనంతరం తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా రన్ టైం 2 గంటల 35 నిమిషాలు ఉంటుందట. కథ విషయానికి వస్తే.. ఒక మినిస్టర్ ఓ భూమిపై కన్నేస్తాడు. దాని ఓనర్లు ఆ భూమిని.. ఆ దగ్గర్లో ఉన్న ఒక ఊరిలో ఉన్న గుడికి రాసేసి వెళ్ళిపోతారు.
ఆ ఊర్లో జనాలకి ఆ గుడి గురించి, అలాగే ఆ భూమి తమ సొంతం అనేదాని గురించి వారికి తెలియదు. ఇక ఆ భూమి విలువ రూ.330 కోట్లు కాబట్టి.. ఆ మినిస్టర్.. ఆ గుడిలో ఉన్న డాక్యుమెంట్స్ ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ముగ్గురు స్నేహితులు (బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్)..లు ఆ మినిస్టర్ ప్లాన్ కి అడ్డుపడతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది.. మిగిలిన కథగా తెలుస్తుంది.
‘భైరవం’ మంచి కథాబలం ఉన్న సినిమా అని.. చూసిన వారు చెబుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్(Nara Rohith), మంచు మనోజ్(Manchu Manoj) ..లు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని. ముఖ్యంగా మంచు మనోజ్ విలనిజం అందరినీ మెస్మరైజ్ చేస్తుందని.. కచ్చితంగా ఈ సినిమా తర్వాత మనోజ్ రేంజ్ వేరుగా ఉంటుందని చెబుతున్నారు.