సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో ‘కూలి’ (Coolie) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ సినిమాకు దర్శకుడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. పాన్ ఇండియా మూవీ కాబట్టి.. అన్ని భాషల్లోనూ క్రేజ్ ఏర్పడేలా స్టార్ క్యాస్టింగ్ ను తీసుకుంటున్నాడు లోకేష్. టాలీవుడ్ నుండి నాగార్జునని (Nagarjuna) తీసుకున్నాడు. కన్నడ వారి కోసం ఉపేంద్రని (Upendra) తీసుకున్నాడు. అలాగే హిందీ ప్రేక్షకుల కోసం ఆమిర్ ఖాన్ (Aamir Khan) కేమియో ఉంటుంది.
అందుకే సినిమాకి అన్ని భాషల నుండి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోపక్క ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోలతో పాటు హీరోయిన్ల సంఖ్య కూడా పెరుగుతూనే వస్తుందట. అలా అని ఆ హీరోయిన్లు ఆ నలుగురు హీరోలకి జోడీలుగా నటించడం లేదు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘కూలి’ సినిమాలో ఇప్పటికే శృతి హాసన్ (Shruti Haasan) ..
ప్రీతి అనే పాత్రకి ఎంపికయ్యారు. మరోపక్క పూజా హెగ్డే (Pooja Hegde) కూడా స్పెషల్ రోల్ చేస్తుంది. అలాగే రెబా మోనికా జాన్ (Reba Monica John) కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఒక సీనియర్ హీరోయిన్ ను కూడా తీసుకున్నారట. రజినీకాంత్ కు జోడీగా ఆమె కనిపించబోతుందని తెలుస్తుంది. ఆమె పాత్ర సినిమాలో అత్యంత కీలకంగా ఉంటుందట. దీంతో ప్రస్తుతానికి ఆ పాత్రని రివీల్ చేయకుండా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా దాచి ఉంచినట్టు స్పష్టమవుతుంది.