‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ (Karthikeya).. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు కానీ, ఏది కూడా దాని రేంజ్లో బ్లాక్ బస్టర్ కాలేదు. ‘బెదురులంక 2012 ‘ (Bedurulanka 2012)గత ఏడాది రిలీజ్ అయ్యి డీసెంట్ సక్సెస్ అందుకుంది కానీ అది ‘ఆర్.ఎక్స్.100’ రేంజ్ సక్సెస్ కాదు. ఇక అతను హీరోగా రూపొందిన ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) అనే మూవీ మే 31 న రిలీజ్ అయ్యింది. యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు.
రథన్ (Radhan) సంగీతం అందించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్ గా నటించింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు.కానీ రెండో రోజు నుండి పికప్ అయ్యింది. నిన్న 4వ రోజు కూడా పర్వాలేదు అనిపించింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘బెదురులంక 2012’ చిత్రానికి రూ.4.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.2.63 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.17 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.