Shantipriya: శాంతిప్రియ అలియాస్ నిశాంతి గురించి ఆసక్తికర విషయాలు..!

సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి.. ఒక్కసారి ముఖానికి మేకప్ పడితే.. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది.. ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా.. ఏవో కారణాలతో కొంత గ్యాప్ వచ్చినా కానీ.. మనసంతా షూటింగ్స్ మీదే ఉంటుంది. నిద్రలో కూడా లైట్స్, కెెమెరా, యాక్షన్ సౌండ్సే వినిపిస్తుంటాయి అని ఎంతోమంది నటీనటులు చెప్పగా విన్నాం.. ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగినవాళ్లు.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లిళ్లు చేసుకుని.. ఇన్నాళ్లూ పిల్లలతో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి..

ఇప్పుడు ఖాళీ టైం దొరకడంతో తిరిగి రీ ఎంట్రీ ఇస్తూ..దూసుకెళ్తున్నారు. రీసెంట్‌గా ఆ లిస్టులో సీనియర్ నటి భానుప్రియ చెల్లెలు కూడా వచ్చి చేరింది. భానుప్రియ గురించి తెలుగు ఆడియన్స్‌కి కొత్తగా పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోలందరితోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో తల్లి, వదిన లాంటి క్యారెక్టర్లతో అలరించారు. ఆమె చెల్లెలు శాంతిప్రియ కూడా నటిగా రాణించారు.. శాంతిప్రియ అసలు పేరు శాంతమ్మ.. నిశాంతి పేరుతో పాపులర్ అయ్యిందామె..

తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో యాక్ట్ చేసింది. ‘మహర్షి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిశాంతి.. సింహస్వప్నం (జగపతి బాబు), అగ్ని (నాగార్జున) యమపాశం, రక్త కన్నీరు, నాకూ పెళ్లాం కావాలి, అగ్ని, శిలా శాసనం, జస్టిస్‌ రుద్రమదేవి లాంటి సినిమాలు చేసింది. కెరీర్ బాగా సాగుతున్న టైంలోనే మ్యారేజ్ చేసుకుని సినిమాలు పక్కన పెట్టేసింది. ఆమె భర్త సిద్దార్థ్ రే (సుశాంత్ రే) హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. వీరికి శుభమ్ రే, షిష్యా రే అనే ఇద్దరు కొడుకులున్నారు. వివాహం జరిగిన కొద్ది కాలానికే.. 40 సంవత్సరాల వయసులో ఆయన గుండెపోటుతో మరణించారు.

తర్వాత పలు హిందీ సీరియల్స్ చేసింది కానీ సినిమాల్లో మాత్రం కనిపించ లేదు. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిందామె. ఈమధ్య ‘ధారావి బ్యాంక్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. సునీల్‌ శెట్టి, వివేక్‌ ఓబెరాయ్‌ కూడా ఇందులో యాక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో సునీల్‌శెట్టి చెల్లెలు పొన్నమ్మ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది నిశాంతి. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇప్పుడు మరికొన్ని సినిమాలు, సిరీస్‌లకు ఆమె ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిశాంతి వయసు 53 సంవత్సరాలు. ఇప్పటికీ చక్కటి ఫిజిక్ మెయింటెన్ చేస్తుందామె.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus