‘బిగ్ బాస్ సీజన్ 9’ క్లైమాక్స్ కి చేరుకుంది. 15వ వారంతో ఈ సీజన్ ముగుస్తుంది. విన్నర్ ఎవరు అనేది మరో వారంతో తేలిపోతుంది. గ్రాండ్ ఫినాలే ని ఘనంగా ఏర్పాటు చేయబోతున్నారు. గెస్ట్..లతో డాన్సులతో ఈ సీజన్ కి గ్రాండ్ గా గుడ్ బై చెప్పేందుకు యూనిట్ సభ్యులు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా….ఈ 14వ వారం నామినేషన్స్ లో సుమన్ శెట్టి, డీమాన్ పవన్,ఇమ్మానుయేల్, తనూజ, సంజన,భరణి, కళ్యాణ్ పడాల.. వంటి వారు ఉన్నారు.
వీరిలో ఓట్లు తక్కువ పడటంతో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఇన్నాళ్లు సిన్సియారిటీతో, సింపతీతో నెట్టుకొచ్చాడు అనే అభిప్రాయం సుమన్ శెట్టి పై ఉంది. అయితే సీజన్ క్లైమాక్స్ కి వచ్చేసరికి అలాంటివేమీ పనిచేయవు కాబట్టి.. సుమన్ శెట్టి ఎగ్జిట్ ఇవ్వాల్సి వచ్చింది.

దీంతో పాటు ఇంకో షాకింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ ను కూడా ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు భరణి. ఇది అందరికీ షాకిచ్చే అంశమే. సుమన్ శెట్టి తర్వాత తక్కువ ఓట్లు పడిన కంటెస్టెంట్ భరణి అని టాక్. సుమన్ శెట్టికి 6 శాతం ఓట్లు పడితే.. భరణికి 8 శాతం ఓట్లు పడినట్టు సమాచారం.
అందుకే భరణి కూడా ఎగ్జిట్ ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి భరణి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ అతను గతంలోనే ఎలిమినేట్ అయ్యి సింపతీ సంపాదించుకున్నాడు. దాని వల్ల మళ్ళీ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి చివరి వరకు రాగలిగాడు.
