Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ ర్యాప్‌ సాంగ్‌ చూశారా!

సినిమా విడుదలకు ముందు ప్రమోషనల్‌ సాంగ్‌ చేస్తుంటారు మన సినిమావాళ్లు. కానీ సినిమా విడుదలైన సుమారు రెండు వారాల తర్వాత ప్రమోషనల్‌ సాంగ్‌ వస్తే… ఇదేదో కొత్తగా ఉంది కదా. ఆ కొత్త పని చేసింది ‘భీమ్లా నాయక్‌’ టీమ్‌. ‘భీమ్ల నాయక్‌ ఆన్‌ డ్యూటీ’ అంటూ ఓ వీడియో సాంగ్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. సినిమా క్లైమాక్స్‌ ముందు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌గా వాడిన సంగీతంతో ఈ పాటను తమన్‌ స్వరపరిచారు. ఆ పాట ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘భీమ్లా నాయక్‌’ సినిమాకు సంబంధించి చాలా పాటలు విడుదలయ్యాయి. టైటిల్‌ సాంగ్‌కి తొలుత అంతగా మంచి మార్కులు పడకపోయినా… ఆ తర్వాత అందరికీ ఎక్కేసింది. ‘అంత ఇష్టం..’ పాట కూడా ఆకట్టుకుంది. కానీ ఆ పాటను సినిమా నుండి తీసేశారు. అయితే ఇప్పుడు విడుదల చేసిన పాట కూడా సినిమాలో లేదు. అందుకే ప్రమోషనల్‌ సాంగ్‌ అన్నాం. సినిమా మేకింగ్‌ వీడియోను ఆ పాటలో చూపించారు. వీడియోలో పవన్‌ కల్యాణ్‌ చాలా హుషారుగా కనిపించారు.

పాటలో పవన్‌ తర్వాత ఎక్కువగా కనిపించేది త్రివిక్రమ్‌ కావడం గమనార్హం. పవన్‌ కనిపించే ఫ్రేమ్స్‌లో సగం ఫ్రేమ్స్ త్రివిక్రమ్‌ కనిపిస్తారు. సినిమా షూటింగ్‌లో త్రివిక్రమ్‌ ఎంతగా లీనమయ్యారు అనేది ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. వీడియోలో దర్శకుడు సాగర్‌ కె చంద్ర అయితే బిజీ బిజీగా సీన్స్‌ వివరిస్తూ, తీస్తూ కనిపించారు. ఇక సెట్స్‌ జరిగిన కామెడీ, నవ్వులు బాగున్నాయి. అయితే వీటన్నింటిక కంటే మరో ఆసక్తికర అంశం పాట బ్యాగ్రౌండ్‌లో వినిపించే మాట.

అవును, పాట బ్యాగ్రౌండ్‌లో ఓ మాట మెల్లగా వినిపిస్తూ ఉంటుంది. అది.. ‘మనల్ని ఎవడ్రా ఆపేదిక్కడ’. మీరు కూడా ఈ మాట వినే ఉంటారు. పాటను ర్యాప్‌గా రోల్‌ రైడా రాశారు. ఈ క్రమంలో ఈ మాటను యాడ్‌ చేశారు. ఈ మాట ఎందుకు పెట్టారు, ఉద్దేశం ఏంటి అనేది రెండు రకాలుగా వినిపిస్తోంది. ఒకటి సినిమాలో డేనియల్‌ శేఖర్‌ పాత్రపై భీమ్లా నాయక్‌ యాటిట్యూడ్‌ అని కొందరు అంటుంటే, ఇంకొందరు పవన్‌ నిజ జీవితం ఉదహరించి రాశారు అంటున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus