Bheemla Nayak: ఆ రీజన్ వల్లే పవన్ మూవీ టైటిల్ మారిందా?

మలయాళంలో అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రీమేక్ భీమ్లా నాయక్ పేరుతో తెలుగులో పవన్, రానా హీరోలుగా సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ ఈ సినిమాకు కథనం, మాటలు అందిస్తుండగా మాటల మాంత్రికుడు ఈ సినిమా కోసం 15 కోట్ల రూపాయలతో పాటు భీమ్లా నాయక్ సినిమా లాభాల్లో వాటా తీసుకుంటారని సమాచారం. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

పవన్, రానా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల పేర్లు అ అనే అక్షరంతో మొదలవుతాయనే సంగతి తెలిసిందే. పవన్ రానా కాంబో మూవీకి త్రివిక్రమ్ మొదట ‘అసుర సంధ్య‌వేళ‌లో..’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని సమాచారం. అయితే పవన్ కు ఉన్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా టైటిల్ ను మార్చారని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

పవన్ కు జోడీగా నిత్యామీనన్ ఈ సినిమాలో నటిస్తుండగా రానాకు జోడీగా ఈ సినిమాలో సంయుక్తమీనన్ నటిస్తున్నారు. భీమ్లా నాయక్ టీజర్, ట్రైలర్ రిలీజ్ డేట్లు ఫిక్స్ అయ్యాయని తెలుస్తోంది. వకీల్ సాబ్ తర్వాత పవన్ ఖాతాలో, అరణ్య తర్వాత రానా ఖాతాలో భీమ్లా నాయక్ సినిమాతో హిట్ చేరుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. భీమ్లా నాయక్ రిలీజైన తర్వాతే రానా నటించిన విరాటపర్వం మూవీ రిలీజ్ కానుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus