‘భీమా’ సినిమా ప్రచార చిత్రాల్లో గోపీచంద్‌ను చూసి… సినిమాలో ఏదో మేటర్ ఉంది. కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనిపించి ఉంటుంది. హీరో లుక్, ఎంట్రీ సీన్లు లాంటివి ఆసక్తికరంగా అనిపించాయి. అయితే ఈ సినిమాలో అంతకుమించి మరికొన్ని అంశాలు ఉన్నాయి అంటున్నారు నిర్మాత కె.కె.రాధామోహన్. అందులో ఒకటి సినిమాలో హీరో పాత్ర అని చెబుతున్నారు. అంటే గోపీచంద్‌క మరో లుక్ కూడా ఈ సినిమాలో ఉందట. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అనేది ఆయన మాట.
కథ, జానర్ పరంగా ‘భీమా’ (Bhimaa) సినిమా విభిన్నంగా ఉంటుందని చెప్పిన నిర్మాత… అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని నమ్మకంగా ఉన్నారు. గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకు ఎ.హర్ష దర్శకత్వం వహించారు. ఈ నెల 8న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాలో స్క్రిప్ట్‌లో చాలా కొత్త అంశాలు ఉన్నాయని చెప్పారు నిర్మాత. గోపీచంద్ గతంలో చేసిన పోలీసు పాత్రలఉ భిన్నంగా, వైవిధ్యభరితంగా ఈ సినిమా ఉండనుందని చెప్పారు.
ట్రైలర్ చూసి కొందరు ఈ సినిమాను ‘అఖండ’తో పోలుస్తున్నారని.. కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు ఏ మాత్రం పోలిక లేదని చెప్పారు. ఈ సినిమాలో చూపించిన పరశురామ క్షేత్రం బెంగళూరు, బదామి పరిసర ప్రాంతాల్లో ఉందని, అక్కడ జరిగే కథ ఈ సినిమా అని చెప్పారు. శివాలయం, అఘోరాలను ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం చూపించామని తెలిపారు. పోలీసుగా కాకుండా గోపీచంద్‌ను మరో గెటప్‌లో చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని నిర్మాత తెలిపారు.
ఆ కొత్త పాత్ర ఏంటనేది థియేటర్‌లోనే చూడాలి అంటున్నారాయన. అయితే మూడు రోజుల్లో సినిమా అంటూ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆ రెండో గోపీచంద్ పాత్ర కనిపిస్తోంది. అయితే ఫ్రంట్ లుక్ చూపించలేదు. రగ్‌డ్ లుక్‌లో గోపీచంద్ కనిపిస్తారని చెప్పొచ్చు. ట్రైలర్‌లో చూపించినట్లుగా బ్రహ్మరాక్షసుడి పాత్రలో గోపీచంద్ కొత్తగా కనిపిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో ఆయుష్ శర్మ హీరోగా ఓ హిందీ సినిమా తెరకెక్కుతోందట. ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తారట.