చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా మాస్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గత కొన్నేళ్లుగా సక్సెస్ లేని మెహర్ రమేష్ కు ఈ సినిమాతో సక్సెస్ గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవి కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రకు భారీస్థాయిలో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కేవలం సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతోందని అందరూ భావిస్తుండగా అనిల్ సుంకర మాట్లాడుతూ భోళా శంకర్ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ తో పాటు ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు ఉన్నాయని తెలిపారు.
కమర్షియల్ హంగులతోనే ఈ సినిమా తెరకెక్కుతోందని అనిల్ సుంకర కామెంట్ చేశారు. ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా తర్వాత ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధించే విధంగా మెగాస్టార్ చిరంజీవి జాగ్రత్త పడుతున్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లోనే విడుదల కానున్నాయి. శక్తి, షాడో సినిమాల ఫలితాలు మెహర్ రమేష్ కెరీర్ కు మైనస్ గా మారాయి.
మెహర్ రమేష్ కు భోళా శంకర్ సినిమాతో సక్సెస్ దక్కడంతో పాటు చిరంజీవి తర్వాత సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే ఆయన పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!