Bhola Shankar: చిరంజీవి సినిమాకు ఆ షాకింగ్ ట్విస్ట్ ప్లస్ అవుతుందా?

చిరంజీవి, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భోళా శంకర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దక్కింది. కీర్తి సురేష్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు ఇంటర్వెల్ ట్విస్ట్ హైలెట్ కానుందని తెలుస్తోంది. 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు (Bhola Shankar) సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని సమాచారం. వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. పదేళ్ల తర్వాత మెహర్ రమేష్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. చిరంజీవి నటించిన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి ఫ్యాన్స్ ను ఈ సినిమా నిరాశ పరిచే అవకాశం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమాపై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ మెచ్చే యాక్షన్ సీన్లు సైతం ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. చిరంజీవి భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఉండటంపై ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థాయి మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి యంగ్ జనరేషన్ స్టార్స్ కు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. చిరంజీవి ఎంతోమంది టాలెంటెడ్ హీరోలను సైతం ప్రోత్సహిస్తూ తన మంచి మనస్సును చాటుకుంటున్నారు. సినిమా సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus