Chiranjeevi,Akhil: అఖిల్ కోసం వెనక్కి తగ్గిన మెగాస్టార్ చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో ‘భోళా శంకర్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2023 ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ డేట్ లో పెద్ద మార్పు ఉండబోతుంది. ఒక నెల ఆలస్యంగా మే 12న సినిమాను విడుదల చేయాలని టీమ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా వచ్చిన మూడు నెలల్లోపే చిరంజీవి కొత్త సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు.

కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ని మార్చేశారు. దీనికి కారణం అఖిల్ ‘ఏజెంట్’ సినిమా అని తెలుస్తోంది. ‘భోళా శంకర్’, ‘ఏజెంట్’ ఈ రెండు సినిమాలను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ‘భోళా శంకర్’ సినిమాలో కెఎస్ రామారావు భాగస్వామ్యం ఉంది కానీ బిజినెస్ వ్యవహారాల పరంగా అనిల్ సుంకర అన్నీ చూసుకుంటున్నట్లు ఉన్నారు. ‘ఏజెంట్’ సినిమా ఇప్పటికే ఆలస్యమవుతుండడంతో ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట.

దానికి తగ్గట్లు దర్శకుడు సురేందర్ రెడ్డి క్లైమాక్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారని తెలుస్తోంది. ట్రైలర్ లాంచ్, లిరికల్ సాంగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చాలా ప్రమోషన్స్ మొదలుపెట్టాలి. కానీ ప్రమోషన్స్ కి ఎక్కువ సమయం లేదు. అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘భోళా శంకర్’ సినిమా విషయంలో చిరంజీవి హడావిడి పడడం లేదు.

నిజానికి మొదట్లో ఈ సినిమాపై నెగెటివిటీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మెగాస్టార్ ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో హిట్ కొట్టడంతో.. ఆయనలోని మాస్ కామెడీని సరిగ్గా వాడుకుంటే ఏవరేజ్ కంటెంట్ తో కూడా హిట్ కొట్టొచ్చని భావిస్తున్నారు. మెహర్ రమేష్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈ సినిమా విషయంలో కాస్త తీరికగా ఉన్నారు. మొత్తానికి ‘ఏజెంట్’ కోసం ‘భోళా శంకర్’ని బాగానే అడ్జస్ట్ చేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus