భూమా నాగిరెడ్డి 1964 జనవరి 8 జననం. 1992 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న ఈయన సోదరుడు భూమా శేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణంతో భూమా ఈ స్థానానికి ఎంపికయ్యారు.
1996 లో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నంద్యాల లోకసభ నియోజకవర్గంనకు ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఈయనను ఎంపిక చేయడంతో ఈయన వెలుగులోకి వచ్చారు. భూమా నాగిరెడ్డి లోక్‌సభ సభ్యునిగా మూడు సార్లు తన సేవలను అందించారు.
భూమా పర్సనల్ లైఫ్ : భూమా దొర్నిపాడు మండలం కొత్తపల్లె యొక్క ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు భూమా బాలిరెడ్డి , ఈశ్వరమ్మకు చిన్న కుమారుడు. ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ కక్షా రాజకీయాల కారణంగా తన తండ్రి బాలిరెడ్డి, తనని దూర ప్రదేశములలో ఉంచి చదివించాలని కోరుకున్నాడు. దీని ప్రకారం నాగిరెడ్డిని తమిళనాడు లోని చెన్నైలో CBSE కి అనుబంధంగా వెలంకన్ని ప్రైవేట్ పాఠశాలలో 10+2 చదివించాడు.
ఆ తరువాత, నాగిరెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి బెంగుళూరు వెళ్ళారు. కానీ వెంటనే తన తండ్రి హత్యకు గురి కావడంతో తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన కారణంగా తన జీవితం మారిపోయింది, తదుపరి రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధ కక్షిదారునిగా మారారు. తరువాత తను సీనియర్ రాజకీయవేత్త మరియు మాజీ మంత్రి యస్.వి.సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణి తో వివాహం , తరువాత తను కూడా ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుడిగా మారారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. 2014లో భార్య శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.