సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. నటుడిగా మారి ‘నకిలీ’ ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ‘బిచ్చగాడు’ సినిమా ఇతన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా పాపులర్ చేసింది. ఆ సినిమా ఒక్క తెలుగులోనే రూ.14 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసి 10 రెట్లు ప్రాఫిట్స్ ను అందించింది. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోని నటించిన అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఏదీ కూడా అంతగా సక్సెస్ కాలేదు.
అయితే ఇటీవల ‘బిచ్చగాడు-2’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 19న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. సినిమాకి టాక్ బాగానే వచ్చింది. దీంతో 4 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి బయ్యర్స్ ను లాభాల బాట పట్టించింది. ఒకసారి ఫస్ట్ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
2.27 cr
సీడెడ్
1.13 cr
ఉత్తరాంధ్ర
1.08 cr
ఈస్ట్
0.56 cr
వెస్ట్
0.41 cr
గుంటూరు
0.55 cr
కృష్ణా
0.51 cr
నెల్లూరు
0.33 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
6.84 cr
‘బిచ్చగాడు2’ (Bichagadu 2) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ.. 5 రోజులు పూర్తయ్యేసరికి రూ.6.84 కోట్ల షేర్ ను రాబట్టి.. బయ్యర్స్ కు రూ.0.84 కోట్ల లాభాలను అందించింది.