దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం). తారక్-చెర్రి నటిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుంది. ఇక రాజమౌళి ఏ చిత్రాన్ని తెరకెక్కించినా టైమ్ మాత్రం ఎక్కువగానే తీసుకుంటాడు. ఆయన ముందుగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినా, చెప్పిన టైమ్‌కు తన సినిమాని రిలీజ్ చేసిన దాఖలాలు లేవనే చెప్పాలి. సినిమాలో భాగంగా సీన్స్ తెరకెక్కించే టైమ్‌లో, అవుట్ పుట్ విషయంలో తను పూర్తిగా సంతృప్తి చెందితేనే, ఆ తర్వాత సీన్స్‌ను వెళతాడు రాజమౌళి.. లేకుంటే అక్కడ ఎంతపెద్ద స్టార్స్ ఉన్నా మరో టేక్ చేయాల్సిందే.
ప్రతి సీన్ విషయంలో జక్కన్న టీమ్ చేసే హోంవర్క్‌కే సగం సంవత్సరం గడిచిపోతుంది. సినిమా తీసిన తర్వాత చేతులు కాల్చుకుని, అయ్యో మరోలా తీయాల్సిందే అని బాధపడడంకంటే, ముందుగానే పర్‌పెక్ట్ ప్లానింగ్‌తో బరిలోకి దిగడం జక్కన్న స్టైల్. అయితే అదంతా బాగానే ఉన్నా, రాజమౌళి సినిమాల విషయంలో ఎలాంటి కంప్లైంట్స్‌కు చాన్స్ లేకున్నా, ఆయన సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో మాత్రం ప్రతీసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఆర్ ఆర్ ఆర్ విషయంలో మాత్రం అలాంటిది ఏం జరగదని చెప్పిన టైమ్‌కే వస్తామని మీడియా సాక్షిగా చెప్పారు రాజమౌళి. షూటింగ్ కూడా స్టార్ట్ చేసి ఫాస్ట్‌గా వర్క్ జరుగుతుండగా కరోనా రావడంతో జక్కన్ ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. దీంతో ఈసారి తప్పు రాజమౌళిది కాకపోయినా మరోసారి ఆయన చిత్రం మాత్రం చెప్పిన టైమ్‌కి రావడంలేదు.
అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం ఏంటంటే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ మరీ లేట్ అవదని తెలుస్తోంది. కరోనా బ్రేక్ తర్వాత యాభైరోజులు నిర్విరామంగా పగలు, రాత్రులు షూటింగ్ చేసిన సినిమాకి సంబంధించి కీలకమైన మేజర్ షెడ్యూల్ పూర్తి చేశారు జక్కన్న. ఆ తర్వాత మరో షెడ్యూల్ మహాబలేశ్వరంలో అని అపడేట్ అచ్చింది. అయితే ఇప్పుడు తాజా అప్‌డేట్ ఏంటంటే మహాబలేశ్వరం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్లానింగ్ కూడా జరిగిపోతుందట. దీంతో జక్కన్న స్పీడ్‌కి చిత్ర యూనిట్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఈయనలో ఇంతమార్పు ఏంటని చిత్ర యూనిట్ చర్చించుకుంటున్నారని టాక్.