‘సలార్’ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఒక్కటే. సినిమా బ్లాక్ బస్టర్ అని.! దర్శకుడు ప్రశాంత్ నీల్ .. ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు. అలా అని సినిమాలో ప్రభాస్ కటౌట్ ఉంది కదా .. ఓవర్ ది టాప్ అన్నట్టు యాక్షన్ సీన్స్ డిజైన్ చేయలేదు. ఎక్కడ ఫైట్ పడాలో అక్కడే పడింది. డ్రామా బాగా వర్కౌట్ అయ్యింది.
ట్రైలర్స్ అంచనాలు పెంచేలా కట్ చేయకుండా మంచి పనే చేశారు. దీనివల్ల కథని దృష్టిలో పెట్టుకుని జనాలు థియేటర్ కి వచ్చారు.. ఆ హై మూమెంట్స్ ని ఎంజాయ్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ రెండు విషయాల్లో ‘సలార్’ కి డిజప్పాయింట్మెంట్ ఎదురయ్యింది అని చెప్పాలి. ఎందులో అంటే.. నార్త్ లో ‘సలార్’ కి ఎక్కువ థియేటర్లు దొరకలేదు.
‘కె.జి.ఎఫ్ 2 ‘ లా అక్కడ ఎక్కువ థియేటర్స్ ‘సలార్’ కి దక్కలేదు. పోటీగా షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా ఉంది. అయితే దానికి నెగిటివ్ టాక్ వచ్చినా .. ఎక్కువ థియేటర్స్ హోల్డ్ చేయడం వల్ల నార్త్ లో ‘సలార్’ కి అన్యాయం జరిగింది. అక్కడ మాత్రమే కాదు ఆంధ్రాలో కూడా ‘సలార్’ కలెక్షన్స్ రికార్డులు కొట్టే విధంగా లేవు.
ఎందుకంటే ఈ సినిమాకి ఏపీ ప్రభుత్వం టికెట్ హైక్స్ ఎక్కువగా ఇవ్వలేదు. ‘ఆచార్య’ ‘సర్కారు వారి పాట’ సినిమాలకి ఇచ్చిన హైక్స్ కంటే కూడా ‘సలార్’ కి ఇచ్చిన టికెట్ రేట్ల హైక్స్ తక్కువగా ఉన్నాయి. దీంతో మొదటి రోజు అక్కడ భారీ కలెక్షన్లు ఆశించలేం. కానీ సంక్రాంతి వరకు (Salaar) ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడే ఛాన్సులు ఉన్నాయి.