ఇలా అయితే ‘మహేష్27’ మొదలయ్యేది ఎప్పుడు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు… ఈ ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే తన తరువాత సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేస్తానని మహేష్.. ‘సరిలేరు’ ప్రమోషన్స్ టైంలోనే చెప్పుకొచ్చాడు. కానీ వంశీ చెప్పిన కథ మహేష్ కు నచ్చలేదట. దీంతో ఆ కథని కొంచెం టైం తీసుకుని బాగా డెవలప్ చేసుకు రమ్మని మహేష్ చెప్పాడట. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ టైంలోనే డైరెక్టర్ పరశురామ్(బుజ్జి) ఓ కథ చెప్పాడు. అది కూడా మహేష్ కు నచ్చింది. ఈ ప్రాజెక్ట్ ను కొరటాల మరియు మైత్రి మూవీ మేకర్స్ వారు కలిసి నిర్మించాల్సి ఉంది. అయితే తనకోసం 3 ఏళ్ళు వెయిట్ చేసి.. ‘మహర్షి’ లాంటి హిట్ ఇచ్చాడు కాబట్టి.. వంశీ పైడిపల్లితోనే సినిమా చెయ్యాలని మహేష్ మొదట ఫిక్సయ్యి పరశురామ్ కి చెప్పాడట.

దీంతో పరశురామ్ ఈ గ్యాప్ లో నాగ చైతన్యతో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తుంది. ’14 రీల్స్ వారి దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు కాబట్టి ముందుగా ఆ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ అనుకోకుండా మహేష్.. పరశురామ్ కి ఫోన్ చేసాడు. దీంతో ఎలాగైనా మహేష్ సినిమా ముందు చేసేయాలని అనుకున్న పరశురామ్ కు ’14 రీల్స్ ‘ వారు పెద్ద షాక్ ఇచ్చారు. అడ్వాన్స్ తీసుకున్నావ్ కాబట్టి ముందుగా మా చిత్రమే చెయ్యాలి అంటూ అడ్డుకట్ట వేశారు. ఇప్పుడు ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ’14 రీల్స్’ వారు కలిసి ఓ అండర్స్టాండింగ్ కు వస్తేనే కానీ ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే పరిస్థితి లేదు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus