యాప్స్ బ్యాన్ తో తేజకీ మొదలైన టెన్షన్

  • July 3, 2020 / 11:00 AM IST

ఈ చైనా యాప్స్ బ్యాన్ అనేది ఎంతటి భారీ ఎఫెక్ట్ చూపించిందో చూస్తూనే ఉన్నాం. సదరు యాప్స్ ను నమ్ముకుని బ్రతుకుతున్నవాళ్ళందరూ ఏడుస్తున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు వాళ్ళు ఎంతగా ఎడిక్ట్ అయిపోయారో. సొ ఇలాంటి క్రియేటర్స్/యూజర్స్ చైనా యాప్ బ్యాన్ కారణంగా ఇబ్బందిపడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు కానీ.. ఇప్పుడు ఈ యాప్ బ్యాన్ అనేది దర్శకుడు తేజకి పెద్ద తలపోటుగా మారింది. అదెలాగంటే.. దర్శకుడు తేజ కొన్ని రోజుల క్రితం హలో యాప్ లో క్యాస్టింగ్ కాల్ నిర్వహించాడు.

టాలీవుడ్ లో ఇలా ఒక యాప్ ద్వారా క్యాస్టింగ్ కాల్ నిర్వహించడం అనేది మొట్టమొదటిసారి కావడం, సదరు యాప్ లో జనాలు కూడా ఇబ్బడిముబ్బడిగా పార్టీసిపేట్ చేయడంతో తేజ & టీం తెగ ఆనందపడ్డారు. అయితే.. భారత ప్రభుత్వం ఈ యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించడం, సదరు యాప్స్ అన్నీ రెండు రోజుల్లో మాయం అవ్వడంతో.. తన లైవ్ ఆడిషన్స్ గురించి టెన్షన్ పడుతున్నారు తేజ & టీం.

మరి ఇప్పుడు హలో యాప్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? విన్నర్స్ ను ఎలా సెలక్ట్ చేస్తున్నారు? అసలు నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది తేజ ఒక క్లారిటీ ఇస్తే బాగుండు. ఎందుకంటే.. సదరు హలో యాప్ ద్వారా ఆడిషన్స్ లో పాల్గొన్నవాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలో తెలియక బాధపడుతున్నారు. ఈ విధంగా చైనా యాప్స్ బ్యాన్ తేజ సినిమాల మీద ఎఫెక్ట్ చూపించింది.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus