Geetu: చంటిపై పగ తీర్చుకోవాలనుకున్న గీతు బిస్కెట్ అయ్యింది.! అసలు మేటర్ ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఒకలా గేమ్ ఆడుతుంటే, గీతు మాత్రం ఇంకోలా గేమ్ ఆడుతోంది. వచ్చిన మొదటి వారం నుంచే తన క్యారెక్టర్ ఏంటో ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేసింది. నేను నికార్సుగా ఉంటానని, ప్రతి నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా మార్చుకునే సత్తా ఉందని చెప్తునే వచ్చింది. ఇక ఇంట్లో వాళ్లు నాకు కేవలం కంటెస్టెంట్స్ మాత్రమేనని, గేమ్ లో ఎవ్వరైనా ఒకటే అని భిన్నమైన రీతిలో గేమ్ ప్రారంభించింది. మొదటి వారం నుంచీ గీతు చంటిని టార్గెట్ చేసింది. ఇంట్లో పని చేయడం లేదని, హౌస్ మేట్స్ గురించి వెనకాల మాట్లాడుతున్నాడని పదే పదే చెప్తూ వచ్చింది.

అలాగే, చంటి కూడా గీతుకి మెత్తగా క్లాస్ పీకుతూనే నామినేషన్స్ లో నోరు మూయిస్తున్నాడు. ఇలా ఇద్దరి మద్యలో వాళ్ల మదిలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. గీతు తను కూరగాయలు కట్ చేస్తే అన్నం కూడా తినలేదని, వండిన కూర కూడా గీతు కట్ చేసింది కాబట్టి వద్దని అన్నాడని నాకు కలలో కూడా ఇదే వచ్చిందని చెప్తూ బాధపడిపోయింది. దీనిని గత వారం నాగార్జున పట్టించుకోకుండా వదిలేశారు. ఇక ఇదే ఊపులో గీతు అవకాశం చిక్కినప్పుడల్లా చంటిపై ఫిర్యాదులు చేయడం స్టార్ట్ చేసింది.

రేవంత్ కి, కీర్తికి, ఆదిరెడ్డికి చంటి గురించి చెప్పడం ప్రారంభించింది. ఇందులో భాగంగా కీర్తి బెడ్ రూమ్ లో ఒక్కతే పనిచేస్తున్నప్పుడు చంటి కూరగాయలు కట్ చేస్తూ కెమెరాల కోసం చేస్తోంది అని అన్నాడని కీర్తికి చెప్పింది. దీంతో కీర్తి చంటిని ఈసీజన్ మొత్తం కెప్టెన్ కాకుండా ఓటు వేయమని అడిగినపుడు చంటికి ఓటు వేసి ఈ రీజన్ చెప్పింది. దీంతో చంటి క్లారిఫికేషన్ అడిగాడు. కీర్తి బాధపడింది. మరోసారి గీతు దగ్గరకి వచ్చి ఏమన్నాడు అని క్లియర్ గా అడిగింది. గీతు చాలా కాన్ఫిడెంట్ గా చంటి నిన్ను కామెంట్ చేసాడని చెప్పింది.

ఈవిషయంపై దసరా స్పెషల్ ఎపిసోడ్ లో నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. చంటి ఏం మాట్లాడాడు అనేది వీడియో చూపించాడు. ఈవీడియోలో చంటి తప్పు లేదని క్లియర్ గా అర్ధమైంది. తను మాట్లాడిన మాటలు పాజిటివ్ గానే ఉన్నాయని ఆడియన్స్, నాగార్జున తేల్చి చెప్పారు. ఈ వీడియో చూసిన తర్వాత హౌస్ మేట్స్ తో మాట్లాడుతుంటే గీతు మద్యలోకి వచ్చి మాట్లాడబోయింది. దీంతో నాగార్జున గీతుపై సీరియస్ అయ్యాడు. చంటి విషయంలో కీర్తికి క్లారిఫికేషన్ ఇచ్చాడు.

ఈ వీడియోలో చంటితో పాటుగా మాట్లాడిని బాలాదిత్యని, ఇంకా సుదీప మాటలని కూడా వివరించి చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ కి ఫుల్ క్లారిటీ వచ్చింది.గీతు ఈవిషయంలో ఆర్గ్యూ చేయలేక, చంటి తను కూరగాయలు కట్ చేస్తే అస్సలు తినలేదని మరోసారి చంటి చేసిన పనిని లాగింది. దీంతో చంటిని నిలదీశాడు కింగ్ నాగార్జున. చంటి కేవలం ఒకే ఒక్కసారి కోపంతో అన్నాను అని అంతేకానీ, నేను తినకుండా లేనని చెప్పాడు.

దీనికి కూడా చంటికి ఫేవర్ గానే తీర్పు రావడంతో గీతు తట్టుకోలేకపోయింది. ఎలాంటి ఎమోషన్స్ లేవన్న గీతు కాసేపు బాధపడింది. చంటిపై పగ తీర్చుకోవాలన్న గీతు వీడియో చూపించేసరికి బిస్కెట్ అయిపోయింది. కేవలం కీర్తికి మాత్రమే కాదు, రేవంత్ కి కూడా చంటిపై ఫిర్యాదు చేసింది. నీ వెనకాల చంటి కామెంట్స్ చేస్తున్నాడంటూ రెచ్చగొట్టింది. ఇక ఈవారం గీతుకి ఈవిషయంలో ఎంతమంది నామినేట్ చేస్తారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus