ఏ ముహూర్తాన ‘బిగ్ బాస్3’ అనౌన్స్ చేసారో కానీ.. అప్పటి నుండీ ఈ షో పై వివాదాలు, విమర్శలు వస్తూనే వున్నాయి. ఇప్పటికే నటి శ్వేతా రెడ్డి,అలాగే గాయత్రీ గుప్తాలు ‘బిగ్ బాస్’ హౌస్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆరోపణలు చేయడమే కాదు ఏకంగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇది చాలదన్నట్టు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘బిగ్ బాస్’ షో ప్రదర్శనను రాత్రి 11 గంటల తర్వాత టెలికాస్ట్ చెయ్యాలి.. అలాగే ప్రతీ ఎపిసోడ్ ను సెన్సార్ చేయాలంటూ తెలంగాణా హై కోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వీటితోనే ‘బిగ్ బాస్3’ షో నిర్వాహకులు సతమతమవుతుంటే… ‘ఈసారి మేమే రంగంలోకి దిగుతున్నామంటూ’ ఓయూ విద్యార్థులు కూడా వీరికి మద్దతుగా నిలవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కారణమౌతున్న ‘బిగ్ బాస్’ షో ను ఆపేయాలని, లేని పక్షంలోషో ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించబోతున్న .. నాగార్జున ఇంటితో ముందు ధర్నా చేస్తామని అలాగే… షో నిర్వాహకుల నివాసాలను కొద ముట్టడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. జూలై 21 న ఈ షో మొదలుకాబోతుంది.. అంటే కేవలం నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది. ఇలాంటి టైములో షో మొదలవుతుందా లేదా అనేది ప్రశ్నర్ధకంగా మారింది.