లాక్ డౌన్ కారణంగా ఐదు నెలలకు పైగా విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్, చరణ్ షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. మరో నెలలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలుకానుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనుకున్న సమయానికంటే ఏడాదికి పైగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లేటైంది. దానికి తోడు నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో నిర్మాతల నుండి కూడా దర్శకుడు రాజమౌళిపై ఒత్తిడి పెరిగిపోతుంది. మరో వైపు ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఆర్ త్వరగా పూర్తై థియేటర్స్ లో దిగితే చూడాలని ఆతృతగా ఉన్నారు.
ఇన్ని ఒత్తిళ్ల మధ్య రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలుపెట్టనున్నారు. కాగా షూటింగ్ ఒకసారి మొదలుపెడితే నిరవధికంగా సాగేలా రాజమౌళి ప్రణాళికలు వేస్తున్నాడు. లాంగ్ షెడ్యూల్స్ నందు భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. మిగిలిన 30 శాతం షూటింగ్ లో భీకర యాక్షన్ సన్నివేశాలు, కొన్ని పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. దీనితో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ ల చేత విశ్రాంతి లేకుండా పని చేయించనున్నాడు.
నిరవధిక షూటింగ్ లో ఎన్టీఆర్, చరణ్ చమటోడ్చనున్నారట. ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ నేపథ్యంలో గాయాలపాలు కాకుండా నిపుణుల సలహాలు తీసుకోనున్నారట. ఏదిఏమైనా 2021 సమ్మర్ కి ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుందని సమాచారం.