Bigg Boss Telugu 6: ఈవారం షాకింగ్ ఎలిమినేషన్ పక్కా..! హౌస్ నుంచీ వెళ్లేది ఎవరంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం 12వ వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని వేడెక్కించేస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎవిక్షన్ ఫ్రీపాస్. ఈ పాస్ గెలుచుకున్న ఫైమా దీనిని తనకోసం వాడుతుందా లేదా వేరేవాళ్ల కోసం వాడబోతోందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఫైమా వాళ్ల అమ్మ హౌస్ లోకి వచ్చినపుడు తనకోసమే ఈ ఎవిక్షన్ ఫ్రీపాస్ ని వాడమని క్లియర్ గా చెప్పింది.

ఇప్పుడు ప్రస్తుతం అన్ అఫీషియల్ పోలింగ్స్ లో చూస్తే ఫైమానే తక్కువ పర్సెంట్ తో లీస్ట్ లో ఉంది. కాబట్టి ఫైమా ఈవారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫైమా లాస్ట్ వరకూ ఉండి ఈపాస్ ని వాడుకుని సేఫ్ అయితే, ఈవారం ఎలిమినేషన్ ఉండదు. అప్పుడు మరోవారం డబుల్ ఎలిమినేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫైమా ఎవిక్షన్ ఫ్రీపాస్ ని వాడుకోకుండా వేరేవాళ్ల కోసం వాడితే షాకింగ్ ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది.

అయితే, ఫైమా తర్వాత లీస్ట్ లో ఉన్నది రాజ్ ఇంకా ఆదిరెడ్డి ఇద్దరు మాత్రమే. మిగిలిన వాళ్లందరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. టాప్ లో ఇనాయా సుల్తానా ఉంటే, తర్వాత శ్రీహాన్ ఇంకా రోహిత్ ఇద్దరూ కూడ సేఫ్ గానే ఉన్నారు. వీరిద్దరి తర్వాత శ్రీసత్య సేఫ్ జోన్ లో ఉంది. శ్రీసత్యకి వాళ్ల పేరెంట్స్ రావడం అనేది ప్లస్ అయ్యింది. దీంతో తను ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకుంది.

ఇక రాజ్, ఆదిరెడ్డి , ఫైమా ముగ్గురే లీస్ట్ లో ఉన్నారు. ఫైమా ఒకవేళ పాస్ ని వాడుకుంటే రాజ్ లేదా ఆదిరెడ్డి ఇద్దరిలో ఒకర్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీనిని బట్టీ చూస్తే ఈవారం ఎలిమినేషన్ లో ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందనే అనిపిస్తోంది. నిజానికి ఇలా ఎవిక్షన్ ఫ్రీపాస్ వచ్చినపుడే హౌస్ లో ఏదో ఒక భారీ ట్విస్ట్ ఉంటుంది.

అందుకే, ఈపాస్ కోసం హౌస్ మేట్స్ కష్టపడి మరీ ఆడతారు. కానీ, ఈసారి ఈ ఎవిక్షన్ ఫ్రీపాస్ పైన చాలా లొల్లి జరిగింది. నాగార్జున కూడా వీకండ్ ఫైర్ అయ్యారు. మరి ఇప్పుడు ఎలిమినేషన్ లో దీని ప్రాముఖ్యత ఏంటనేది చూడాలి. బిగ్ బాస్ ఇచ్చే భారీ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే వీకండ్ వరకూ ఆగాల్సిందే. అదీ మేటర్.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus