బిగ్ బాస్ 4: ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

బిగ్ బాస్ 14వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. నిజానికి అభిజిత్ , హారిక, సోహైల్ ఈ ముగ్గురు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. అయితే, అరియానా , సోహైల్, మోనాల్ మధ్యలో జరిగిన ఓపిక టాస్క్ గొడవ వల్ల ఇప్పుడు ఓట్లు తారుమారు అయిపోతున్నాయి. సోహైల్ అరియానాకంటే కూడా లీస్ట్ లో కొన్ని సైట్స్ లో కనిపిస్తున్నాడు. నిజానికి ఈవారం వరకూ కూడా టైటిల్ ఫేవరెట్ పోటీలో సోహైల్ ఉన్నాడు. కానీ, ఈ ఒక్క ఇన్సిడెంట్ ఓటింగ్ ని తారుమారు చేసింది. అరియానా సోహైల్ ని డామినేట్ చేస్తూ ఓటింగ్ లో ముందుకు వస్తోంది.

మరోవైపు అభిజిత్ కి, హారికకి కన్ స్టంట్ గా ఓట్లు పడుతున్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురూ సేఫ్ జోన్ లో ఉంటే, సోహైల్ ఇంకా మోనాల్ లలో ఒకరు ఈవారం ఎలిమినేట్ అయిపోతారా అని కూడా అంటున్నారు. అదేగనక జరిగితే సోహైల్ ఫ్యాన్ బేస్ చేస్కుంటే అఖిల్ ఈసారి లేడు కాబట్టి అఖిల్ ఓట్లు సోహైల్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే, ఈవారం మోనాల్ డేంజర్ జోన్ లో ఉండబోతోంది. ఇలాగే ఇంకో రోజు ఉంటే ఖచ్చితంగా ఈవారం మోనాల్ ఎలిమినేట్ అయిపోతుందనే లెక్కలు వేస్తున్నారు.

బిగ్ బాస్ లవర్స్ పోల్ చేసిన సైట్స్ లో కూడా మోనాల్ కే ఎలిమినేషన్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా మిరాకిల్ జరిగితేనే తప్ప ఇప్పుడు మోనాల్ ఓటింగ్ లో గ్రాఫ్ పెంచుకోలేదు. అరియానా సేఫ్ జోన్ లోకి వచ్చింది కాబట్టి ఈవారం ఖచ్చితంగా మోనాల్ ఎలిమినేట్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. మరి చూద్దాం.. ఏం జరుగుతుంది అనేది. మరిన్ని ఇంట్రస్టింగ్ బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఫిల్మీ ఫోకస్ ఛానల్ కి లాగిన్ అవ్వండి.

[yop_poll id=”1″]

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus