Bigg Boss 5 Telugu: నామినేషన్స్ లో అసలు ఏంజరిగిందో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో రెండోవారం నామినేషన్స్ బ్లాస్ట్ అయ్యాయి. రెండు టీమ్స్ గా విడిపోయిన హౌస్ మేట్స్ ఒకరిపై ఒకరు నిందలు వేస్కుంటూ రెచ్చిపోయారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టాడు. ఉల్ఫ్ టీమ్, ఈగల్ టీమ్ గా హౌస్ మేట్స్ విడిపోయి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇక్కడే ఉమాదేవికి అనీమాస్టర్ కి గట్టిగా పడింది. అంతేకాదు, విశ్వ ఉమాదేవిని నామినేట్ చేసేటపుడు పెద్ద ఆర్గ్యూమెంట్ జరిగింది. ఆలు కర్రీకోసం జరిగిన ఈ వాదనలో అదుపుకోల్పోయిన ఉమాదేవి బూతుమాటలు మాట్లాడింది. దీంతో మిగతా హౌస్ మేట్స్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

విశ్వ ఉమాదేవిని నామినేట్ చేసింది ఎపిసోడ్ లోనే హైలెట్ అయ్యింది. ఇదే ఎపిసోడ్ ని పూర్తిగా టర్న్ తిప్పింది. ఆలు కర్రీ లొల్లి మొదలైంది. ఆలూకర్రీ షేర్ చేస్కోవచ్చా అని నాగ్ సార్ ని అడిగితే మీరు ఒక్కరే తినాలి అన్నారని, అలా ఎలా ఇస్తాను అని చెప్పింది. ఇక్కడే ఆలుకర్రీ నాగ్ సార్ చెప్పినా కూడా నేను అందరికీ ఇచ్చాను అంటే నాకంటే పెద్ద విపి ( బూతు ) ఉండరని బూతుమాట కూడా మాట్లాడింది ఉమా. బిగ్ బాస్ బీప్ లో కవర్ చేసినా అక్కడున్న హౌస్ మేట్స్ కి మాత్రం ఫీజులు పగిలిపోయాయ్..

తర్వాత విశ్వ ఎంటైర్ ఇష్యూపై క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ నేను అడిగినపుడు ఇవ్వలేదు. తర్వాత జెస్సీ కాలుబాలేదు అని రిక్వస్ట్ చేస్తే కర్రీ ఇచ్చారు. ఈవిషయం నచ్చలేదు అంటూ చెప్పి ఉమాదేవిని నామినేట్ చేశాడు. ఈ ఇష్యూ హౌస్ లో తుపాన్ ని తీస్కుని వచ్చింది.

ఆ తర్వాత ఉమాదేవి నామినేషన్ చేయడానికి వస్తూ పెద్ద త్సునామీ సృష్టించింది. సత్తా ఉన్నవాళ్లు.., దమ్ముదైర్యం, బుద్ది బలం ఉన్నవాళ్లు అయితే నాతో ఆడటానికి ట్రై చేయమంది.. లేదంటే నాకు సుర్రు మంటది. అంటూ నాపుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అంటూ రెచ్చిపోయింది. అనీమాస్టర్ కి లెప్ట్ అండ్ రైట్ క్లాస్ పీకింది. అసలు ఏం జరిగింది మేటర్ అనేది ఉమాదేవి చాలా క్లియర్ గా చెప్పింది. తినేసిన డెస్ట్ వేయడానికి అక్కడ కవర్స్ పెట్టారు చాలామంది అక్కడున్నారు, విన్నారు.. మీకు మాత్రమే ఎందుకు వినిపించలేదు. మళ్లీ నేను , లోబోనే వాష్ రూమ్ అండ్ సింక్స్ వాష్ చేస్తున్నామ్ అంటూ మాట్లాడింది. అదే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పింది. అనీమాస్టర్ ఆవిడ మాటల్ని తీస్కోలేకపోయింది. ఇక్కడ మద్యలో శ్వేత దూరి నాకు కూడా వినిపించలేదు అని చెప్పింది. తర్వాత విశ్వని నామినేట్ చేసింది ఉమాదేవి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus